విజయవాడ : అఖిలభారత జాతీయ కాంగ్రెస్ కర్ణాటకలో అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు విజయత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. పలు సంస్థల సర్వేలు విశ్లేషకుల విశ్లేషణలను నిజం చేస్తూ పార్టీ కర్ణాటకలో విజయ దుందుభి మ్రోగించింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన విలేకరుల సమావేశం లో ఏ.పి.సి.సి. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజల విజయమని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలోని తెలుగువారితో మంచి చైతన్యం వచ్చిందని ఇది రాబోతున్న సార్వత్రిక మరియు పార్లమెంట్ ఎన్నికలకు సెమిఫైనల్ గా ఆయన వర్ణించారు. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మరియు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు శివ కుమార్ తో కలిసి మంచి సమన్వయంతో పని చేశామని అక్కడి నాయకులూ కూడా చాలా విస్తృతంగా ప్రజలను చైతన్య పరిచారని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి తరపున రాష్ట్రము నుండి నాయకులు కార్యకర్తలతో కలిసి కర్ణాటకలో పార్టీని విజయంవైపు నడిపించామని అయన అన్నారు. కర్ణాటకలో పార్టీ విజయం చారిత్రాత్మకమైన విజయమని అన్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో రాబెయే ఎన్నికల్లో సమైక్యంగా కృషి చేసి పార్టీని అధికారం లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. దేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ గెలిచి తీరుతుంది అని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వటం ఖాయం అని అధ్యక్షులు రుద్రరాజు ఖరాఖండిగా చెప్పారు.
విలేకరుల సమావేశం అనంతరం విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద అధ్యక్షులు రుద్ర రాజు నాయకత్వంలో బాణాసంచా కాల్చి కాంగ్రెస్ శ్రేణులు వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులతో హోరెత్తిన నినాదాల మధ్య మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
విలేకరుల సమావేశంలో అధ్యక్షులతో పాటు కార్య నిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహ రావు, లామ్ తాంతియా కుమారి, కొలనుకొండ శివాజీ, వి. గురునాధం, పి.వై. కిరణ్, ఏ.ఐ.సి.సి.సభ్యులు కాజా మొహిద్దీన్, మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, రాజనాల రామ్మోహనరావు, డా. జి.శాస్త్రి, ధనికుల మురళి, పి. నాంచారయ్య, శ్రీరామమూర్తి, గొల్లు కృష్ణ, సతీష్, భాగ్యలక్ష్మి, ఖుర్షిదా, గౌస్ తదితర నయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవం లో పాల్గొన్నారు.