• అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోంది? సీబీఐని అడ్డుకుంటున్న ఆ అజ్ఞాతశక్తి మనరాష్ట్ర ముఖ్యమంత్రేకదా?
• మనరాష్ట్రప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని, రాష్ట్రసంక్షేమాన్ని విస్మరించి, అల్లకల్లోలంగా మారిన రైతులవ్యథలు పట్టించుకోకుండా, తన తమ్ముడు అవినాశ్ రెడ్డిని రక్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి, అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు?
• అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోంది?
• నిన్ హైడ్రిన్ టెస్ట్ పూర్తయితే వివేకారాసినట్టు చెప్పబడుతున్న లేఖపైన అసలు వేలిముద్రలు బయటపడతాయి. ఇంకొంతమంది ముద్దాయిలు వెలుగులోకి వస్తారు.
• హత్యగావింపబడిన వివేకా కూతురు డాక్టర్ సునీత ఓ వీరవనిత.
• చరిత్రలో రాణిరుద్రమ, ఝాన్సీరాణి పోరాటంచేసిన శత్రువులకంటే పెద్దశత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలుస్తుంది
• అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే వివేకాహత్య కేసుముగిసిపోయినట్టు కాదు. మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది. కుట్ర బయటకు తీయాలి! హూ కిల్డ్ బాబాయ్ లోని ముద్దాయిలంతా బయటపడాలి
•పోలీసులు చాలామంది వారు చేయవలసిన డ్యూటీ, విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయి అధికారపార్టీ సేవలో పునీతులు అవుతున్నారు
• ముఖ్యమంత్రిగారు వెంకటరమణ అనే కావలి డీఎస్పీని వెంటనే అరెస్ట్ చేసి, దిగజారిపోతున్న మీ ప్రభుత్వప్రతిష్టను కొంతైనా కాపాడుకోండి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు. యథాతథంగా ఆయన మాటల్లోనే …
ప్రజల ధన, మాన, ప్రాణరక్షణకోసం, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఈ రెండుసూత్రాలపై పోలీస్ శాఖ పనిచేయాలి. కానీ మనరాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ శాఖ తద్భిన్నంగా పనిచేస్తోంది.
“ప్రజల ధన, మాన, ప్రాణరక్షణకోసం పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఈ రెండుసూత్రాలపై కూడా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంటుంది. కానీ మనరాష్ట్రంలో దుర్మార్గమైన విషయం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తద్భి న్నంగా పనిచేస్తోంది. పోలీసులు చాలామంది వారు చేయవలసిన డ్యూటీ, విద్యుక్తం, వృత్తి ధర్మాన్ని మర్చిపోయి అధికారపార్టీ సేవలో పునీతమవతున్నారు..చాలాదుర్మార్గం. అంద రూ పోలీస్ ఆఫీసర్లను నేను అనడంలేదు. చాలాపిచ్చిమాట అది. కానీ చూడబోతే చాలా ఎక్కువమంది కనపడుతున్నారు… ఈరకంగా. చట్టప్రకారం వారునిర్వహించాల్సిన విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా మరిచిపోతున్నారు. ఇది ఎలామరి? వాళ్ల విద్యుక్తధర్మాన్ని వారికి ఎలా చెప్పాలి.
పోలీస్ విభాగంలో ఉన్న పైఅధికారులుచెప్పాలి..లేకుంటే ప్రభుత్వంచెప్పాలి. ముఖ్య మంత్రిగారు సీనియర్ ఆఫీసర్లను ఒకసారి పిలిచి మాట్లాడాలి. మావాళ్లుఏంచెబితే అదే చేస్తూ వారిసేవలోనే పునీతమవుతున్నారు అంటా.. అది కరెక్ట్ కాదు. ప్రజలు అన్నిమతాలు, అన్ని వర్గాలు, అన్నికులాలవారికి మీరు సమానంగా సేవచేయాలి అని చెప్పాలి. అందుకే మీకు జీతాలిస్తోంది ప్రభుత్వం. ఇంకొక్కసారి ఏ పోలీస్ అధికారి అయినా, తన విద్యుక్త ధర్మా న్ని మరిచి, మాపార్టీ వాళ్లుచెప్పారని, తప్పుచేస్తే నేను ఊరుకోను అని ముఖ్యమంత్రి చెప్పాలి. చెబుతారా ఆయన? అందులో ఈ ముఖ్యమంత్రి చెబుతారా? ఆవుచేలో మేస్తే దూడగట్టున మేస్తుందా? ముఖ్యమంత్రి చెప్పడుకాబట్టి, పోలీస్ అధికారులు కూడా చెప్పడం మానేశారు.
ఎందుకు నేను ఇదంతా చెబుతున్నాను అంటే.. పోలీస్ అధికారుల్లో మరీముఖ్యంగా డీజీ లాంటివారు, అడిషనల్ డీజీలాంటి అధికారుల్లో చలనం వస్తుందని. డీజీ అండ్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ అచేతనంగా ఉన్నారు. మీరు ప్రాణమున్న అధికారులు కదలాలి.. చలనం ఉండాలి. స్పందించాలి.. ప్రతిస్పందించాలి. ఇవేవీలేకుండా అచేతనంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్లి చెప్పాలి? తెలంగాణకు వెళ్లిచెబుతారా? బెంగుళూరు వెళ్లి చెబుతారా? మీరు ఈ విధంగా అచే తనంగా ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి..ఎవరికి చెప్పాలి? మీరు ఈరకంగా అచేతనంగా ఉంటే ఇది సబబా అని అడుగుతున్నా.
పోలీసులు ఈరకంగా చేయడం సబబా అని అడుగుతున్నా . ఏంచేశారు? గతంలో జరిగినవి కొన్ని గుర్తుచేస్తున్నాను. 2020లో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు ఏదో ఉద్యమంచేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేకలు వేస్తు న్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అనే పోలీస్ అధికారి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న జార్జ్ ఫ్లాయిడ్ మెడపై తనమోకాలిని అదిమిపెట్టి, 8నిమిషాలు ఉంచడంతో అతను ఊపిరాడక చనిపోయాడు. అక్కడి పోలీస్ కు అంత అవసరమా? అతను ఏమైనా అంతర్జాతీ య నేరస్తుడా.. ఉగ్రవాదా..మహిళలపట్ల అసభ్యంగాప్రవర్తించిన వ్యక్తా? జాతులు, కులాలు, మతాలపట్ల వ్యతిరేకభావంతో ఏమైనా కల్లోలంసృష్టించాడా? ఒక ఉద్యమకారుడు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తే చంపేస్తారా?
అమెరికాకూడా ప్రజాస్వామ్య దేశమే. మీకందరికీ తెలుసోలేదో? వదల్లేదు అక్కడిపోలీస్ అధికారిని. తప్పుచేసిన ఆ పోలీస్ అధికారి అలెగ్జాండర్ ఇప్పుడు అమెరికా జైల్లో మగ్గిపోతున్నాడు. ఎందుకు నేను ఇదిచెబుతున్నాను అంటే, ఇప్పుడు మీకు ఒక పోలీస్ అధికారిని చూపిస్తా. గౌరవ ముఖ్యమంత్రిగారు, గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డిగారు, ఈయన్ని ప్రతిదానికి తీసుకు రావాలి.. ఎందుకంటే అంతా అతనే కదా! అటు ముఖ్యమంత్రి పాత్ర అతనిదే, హోంమంత్రి పాత్ర అతనిదే. అమ్మా మీరుఏంచేసినా చేయకపోయినా..హోంమంత్రిగా పేరు లిఖించబడిన, శ్రీమతి వనితగారు, మీరు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక్కసారి ఈఫోటో చూడండి.
(విలేకరులకు చూపించిన ఫోటోపై రామయ్య వివరణ : ఇక్కడ ఆపోలీస్ అధికారి రెండుకాళ్ల మధ్యలో తల. తలతాలూకా వ్యక్తి మెడను ఈ వండర్ ఫుల్ పోలీస్ అధికారి తనరెండుకాళ్లతో నొక్కేస్తున్నాడు. ఇందులో బాధితుడు తలకనిపించే వ్యక్తి సురేశ్ అని భారతీయజనతా పార్టీ వ్యక్తి. రెండుకాళ్లమధ్య ఉన్నది సురేశ్. కాళ్లు కనిపిస్తున్న వ్యక్తి డీఎస్పీ వెంకటరమణ. కావలి డీఎస్పీ. నేను ఇక్కడరాజకీయాలు మాట్లాడటంలేదు. సోమువీర్రాజు ఉన్నాడు. మీకేంపని అంటారేమో!)
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ను బలితీసుకున్న పోలీస్ అధికారి అలెగ్జాండర్ కు, బీజేపి నేత సురేశ్ ను తనరెండుకాళ్లమధ్యలో అదిమిపెట్టిన కావలి డీఎస్పీ వెంకటరమణకు ఏమి తేడా ఉంది? అమెరికాలో తప్పుచేసిన అలెగ్జాండర్ జైల్లోమగ్గిపోతున్నాడు? మరి ఇక్కడ తప్పు చేసిన డీఎస్పీని కూడా కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.
అదికాదు చూడాల్సింది. ఇక్కడ ప్రజాస్వామ్యం కుంటుపడింది. అరాచకం ప్రస్ఫుటంగా కనపడుతోంది.జగన్మోహన్ రెడ్డిగారి ప్రభుత్వ పొగరుబోతుతనం కనపడుతోంది. నేను ఎందుకు ఊరుకుంటా? అక్కడ అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిందాని కి, ఇక్కడ ఈరోజు ఈ బాధితుడు బీజేపీకి చెందినసురేశ్ ఆపోలీస్ అధికారి రెండుకాళ్లమధ్య బాధపడుతూ ఉన్నదానికి తేడా ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ మైడియర్ ఫ్రెండ్ రెస్పెక్టెడ్ డీజీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెస్పెక్టెడ్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు, రెస్పెక్టెడ్ అడ్వైజ ర్ ఆఫ్ దిస్ గ్రేట్ స్టేట్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రెస్పెక్టెడ్ హోం మినిస్టర్ శ్రీమతి వనిత గారు? ఇక్కడ ఈపోలీస్ అధికారి ఎవరు.. డీఎస్పీ వెంకటరమణ కావలి డీఎస్పీ అంట!
నేను ఒక్కటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డిగారు ఈపోలీస్ ఆఫీసర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని నేను అడుగుతున్నాను. దిస్ డీఎస్పీ వెంకటరమణ యాజ్ కమిటెడ్ యాన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 307 ఐ.పీ.సీ అటెంప్ట్ టూ మర్డర్. ఆ సురేశ్ అనే బీజేపీ నాయకుడి మెడను తనరెండు మోకాళ్ల మధ్యపెట్టి, అతన్ని చంపేసే ప్రయత్నంచేశాడు. దిస్ ఈజ్ ఏ అటెంప్ట్ టూ మర్డర్. అటెంప్ట్ టూ కిల్ మిస్టర్ సురేశ్ ఆఫ్ బీజేపీ. బీజేపీ వీర్రాజు కాక పోతే నేను అడగకూడదా? వర్లరామయ్య ఎక్కడ అన్యాయంజరిగితే అక్కడ మాట్లాడతాడు.
పోలీస్ ఆఫీసర్ అలాచేయమని ఏచట్టంలో చెప్పలేదు. అందుకే అతన్ని అటెంప్ట్ టూ మర్డర్ 307 కింద వెంటనే ఈరోజేఅరెస్ట్ చేసి, జైలుకుపంపి మీ ప్రభుత్వానికి కొంచెమైనా నైతికవిలువలు ఉన్నాయని నిరూపించుకోండి అని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. పైగా ఆ సురేశ్ ది ఏకులమో కనుక్కోమని చెప్పాను. అతను ఎస్సీవిభాగానికి చెందినవాడైతే ఒకవేళ ఎస్సీఎస్టీ కేసుకూడా పెట్టాలి.
ఆ వెంకటరమణ డీఎస్పీకి ఒక్కక్షణంకూడా డీఎస్పీగా పనిచేసే నైతిక హక్కులేదు. పోలీస్ అధికారే కాదు అతను. పోలీస్ వ్యవస్థలో చీడపురుగు అతను. అందుకే డీజీగారు వెంటనే అతనిపై ఎఫ్.ఐ.ఆర్ ఇష్యూచేయాల.. అతన్ని అరెస్ట్ చేయాల.. రిమాండ్ కు పంపాల..కోర్టులో ట్రయల్ కూడా తొందరగా పూర్తిచేయించి, అక్కడ అలెగ్జాండర్ జైలుకెళ్లినట్టుగా ఇక్కడ ఇతనుకూడా వెంకటరమణ కూడా జైలుకెళ్లేట్లుచూడాలని కోరుతు న్నాం. ఇది నా ప్రెస్ మీట్లో మొదటిపార్ట్
రెండోపార్ట్.. అందరికీ తెలిసినపార్ట్. అవినాశ్ రెడ్డిగారి అరెస్ట్.అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి ఎవరు? మనరాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా! రాష్ట్రమంతా, అందరూకూడా, దేశమంతాకూడా మొన్న అయిపోయింది.. నిన్న అయిపోయి దని ఎదురచూస్తుంటే వాయిదాపడుతోంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పాత్రికేయుల్ని సీబీఐని అడుగుతున్నా. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండా రక్షిస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? ఆ అజ్ఞాతశక్తి మనరాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డిగారే కదా!
జగన్మోహన్ రెడ్డిగారి కి మనరాష్ట్రప్రజలు ఇచ్చిన మొత్తం అధికారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా సంపా దించిన తనఅవినీతి సంపాదన మొత్తాన్ని, తనతెలివితేటలు మొత్తాన్ని రాష్ట్రసంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారు అని అనుకుంటున్నారా? లేక అల్లకల్లోలంగా మారిన రైతులజీవన విధా నాన్నిబాగుపర్చడానికి, నీళ్లలో తడిచిపోయిన పంట కొనడానికి ఏమైనా ఉపయోగిస్తున్నారా ?
కాదు. తొలగించిన దళితసంక్షేమ పథకాలన్నీకూడా మరలాప్రవేశపెట్టడానికి ఉపయోగి స్తున్నాడా? లేదు. అతని ముందున్న ఏకైకలక్ష్యం తనసోదరుడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుం డా చూడటమే. అతనే ఆ అజ్ఞాతశక్తి, అతను ఏంచేస్తున్నాడో తెలియదు..ఎలా చేస్తున్నాడో తెలియదు.. అతనితరుపున లాబీయిస్ట్ లు ఎలా ప్రయత్నంచేస్తున్నారో తెలియదు? ఇంకా అరెస్ట్ కాలేదనే మీమాంసమాత్రం రాష్ట్రప్రజల్లో ఉంది. నేను అడుగుతున్నాను ఈరోజున సీబీఐని అడుగుతున్నాను. మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మిమ్మల్ని కూడా ఇబ్బందిపెట్టారు. సీబీఐ అధికారులపై తప్పుడుకేసులుపెట్టడం ఇక్క డే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోనే సాధ్యమైందిఅది. అందుకని మిమ్మల్ని తప్పుపట్టడంలేదు, కానీ ఎందుకుమీనమేషాలు లెక్కెడుతున్నారు? మీరు హైకోర్ట్ లో దేర్ ఈజ్ ఏ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ మిస్టర్ అవినాశ్ రెడ్డి అని అఫిడవిట్ వేయలా? వేశారా లేదా? సుప్రీంకోర్టుకు చెప్పలా? మీరు వదిలిస్తే మేం లోపలే స్తామని అన్నారా.. లేదా? మరి ఇంకెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?
నిన్ హైడ్రిన్ టెస్ట్ దేనికి చేస్తారు? ఫోరెన్సికల్ ల్యాబ్ లో ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్స్ కు కూడా కనిపించని ఇన్ విజబుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా కనుక్కునే, కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ టెస్ట్ చేస్తారు? దానికి అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధం ఏమిటి? మినాయిడ్రి న్ టెస్ట్ కు, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధంలేదుకదా! తీసుకెళ్లి అతన్ని లోపలేయచ్చుకదా ! ఆ పనిచేయకుండా మీరుఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు? మీకు అడ్డుపడు తున్న ఆశక్తి మనశక్తేనా? ఈ శక్తేనా? చాలా కాలాతీతమైంది. మీ ఎఫీషియన్సీని కూడా ప్రశ్నించేస్థాయిలో ప్రజలు ఉన్నారనికూడా సీబీఐ గమనించాలి. సీబీఐ డైరెక్టర్ …నాక్కూడా వారి గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీ మీ అఫిషియన్సీని తప్పుపట్టడంలేదు.
వివేకా కూతురు డాక్టర్ సునీత ఓ వీరవనిత.చరిత్రలో రాణిరుద్రమ, ఝాన్సీరాణి పోరాటంచేసిన శత్రువులకంటే పెద్దశత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలుస్తుంది. ఆ అమ్మాయి. డాక్టర్ సునీత, డాటర్ ఆఫ్ వివేకానందరెడ్డి. మనంచెబుతాం..ఝాన్సీ లక్ష్మీభాయి, రాణిరుద్రమదేవి..ఈ అమ్మాయి. రాణిరుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీభాయిలు ఎదుర్కొన్న శత్రువులు జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతులేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాల ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. కాకతీయసామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదేమీకాదు. పెద్దసువిశాల సామ్రాజ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత శక్తిమం తుణ్ణి ఢీకొంటున్న మహిళ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి..వీరవనిత లేకపోతే పోలీసులు ఎప్పుడో ఈ కేసుని అన్ డిటెక్టబుల్ అనిచెప్పేవారు. ఝాన్సీలక్ష్మిభాయి, రాణిరుద్రమ రక్తా న్ని పుణికిపుచ్చుకున్న ఆమె పోరాటపటిమ ఈకేసుని సజీవంగా ఉంచింది. మహిళలం దరూ కూడా ఆమెనుఆదర్శంగా తీసుకోవాలి.
పెద్దడాక్టర్ అయిన ఆఅమ్మాయిని మండు టెండలో చున్నీని నెత్తికి కట్టుకొని పరిగెడుతుంటే, ఈ ప్రభుత్వానికి జాలి, దయ, కరుణ, మానవత్వంలేవా? ఆమె ఎవరోకాదే.. పరాయిమహిళకాదే, నీ సొంతచెల్లెలు. ఆకన్ను.. ఈకన్ను అన్నారు. ఒకకన్ను ఏమో ముద్దాయిని పట్టుకోమని తిరుగుతుంటే, మరోకన్ను ఏమో డోంట్ అరెస్ట్ మీ అన్నా.. అంటోంది. ఇప్పటికైనా సీబీఐ జంపింగ్ టూ యాక్షన్. టేక్ సూటబుల్ యాక్షన్. చట్టప్రకార మే యాక్షన్ తీసుకోండి. మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారమే ముం దుకెళ్లండి. మీ విచారణ మీరుచేసుకోండి, మేంఎక్కడా అడ్డుపడం అని న్యాయస్థానాలు హుం దాగాచెప్పాయి.
అంతస్పష్టంగా చెప్పాక కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నఆ అజ్ఞాతశక్తి ఎవరు? మీ చేతులుబందిస్తున్నది.. మీకాళ్లకు అడ్డుపడుతున్నది.. అతను అరెస్ట్ కాకుండా చూస్తున్న ఆ అజ్ఞాతశక్తి ఎవరో చెప్పండి, అంత శక్తి అడ్డుకున్నాక ఈ కేసు విచారణ మేం చేపట్టలేమని చెప్పండి పోనీ. అవినాశ్ రెడ్డి అరెస్ట్ తోనే వివేకాహత్య కేసు ముగిసిపోయినట్టుకాదని సీబీఐ గుర్తించాలి. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇంకాఉంది. హూకిల్డ్ బాబాయ్ ఉదంతంలోని అసలు ముద్దాయిలు బయటకు రావాల్సి ఉంది. ఇంతటితో అయిపోలేదు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే కేసుముగిసిపోయినట్టు కాదు. మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది. కుట్ర బయటకు తీయాలికదా! హూ కిల్డ్ అనేది కొంతవరకు ఐడియా వచ్చింది. కానీ ఎందుకు చంపారనేది తేలాలికదా! ఎందుకు అనేది సీబీఐ దర్యాప్తుచేయాలి. సుప్రీంకోర్టు కూడా అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయగానే సీబీఐని వదలదు. అది మిలియన్ డాలర్ల క్వశ్చన్. వై దేహేవ్ కిల్డ్ హిమ్. అర్థరాత్రి, తెల్లవారుజామున వచ్చినఫోన్లు, కాల్ లిస్ట్ లుకూడా మీరువదిలేస్తే ప్రజలు వదలరు. ఎందుకంటే అవి ప్రజల మస్తిష్కంలో నిక్షిప్తమయ్యాయి. వాటిపై మీరు సమాధానంచెప్పాలి.. ఎవరు ఎందుకు చంపా రనేది సీబీఐనే బయటపెట్టాలి.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రామయ్య మాటలు :
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈజ్ ప్రివేయిలింగ్ సిన్స్ లాస్ట్ 4 ఇయర్స్ ఇన్ దిస్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ . స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. నిన్న డీఎస్పీ చేసిందేమిటి? అంతచేయాల్సిన అవసరం లేదు. డీజీపీ సరైనవాడు అయితే అతని యూనిఫామ్ ఇప్పించి, అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టా లి. వెంకటరమణా.. బీజేపీ వాళ్లేమీ మిమ్మల్ని వదిలిపెట్టరు. బీజేపీ కార్యకర్తల్ని కాళ్లమధ్య వేసి తొక్కుతున్న డీఎస్పీ ఎవరో తమకుతెలియదంటే మోదీ, అమిత్ షాలు ఊరుకుంటారా?
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ను చంపినట్టు, ఇక్కడ సురేశ్ ను చంపేస్తామంటే ఊరుకుంటారా? మోదీగారు అడక్కముందే డీజీగారు 307కేసుపెట్టి, అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపం డి. బైదట్ యు కెన్ సేవ్ యువర్ ఫేస్. మీ గౌరవాన్ని కొంచెం కాపాడుకోవచ్చు అని తెలియ చేస్తున్నా. బుద్ధిలేనిమాట అది. యువ్ ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్టేట్. నువ్వు ఇంట్లో కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే ఎవరూ నిన్ను ఏమీఅడగరు.
ప్రజలందరి చుట్టూ తిరిగి అందరి ఓట్లు అడుక్కొని, పబ్లిక్ ఫిగర్ అయ్యి, రాష్ట్రముఖ్యమంత్రి అయ్యి, మీ నాన్న ముఖ్యమంత్రిచేశారు, చంపబడిన వ్యక్తి మంత్రిచేశారు…ఎమ్మెల్యే చేశారు.. ఎంపీ చేశారు. ఇంకా ఇదేంటి కుటుంబవ్యవహారమని? కుటుంబవ్యవహారమే అయితే మాబాబాయ్ ని మేం చంపుకున్నామనిచెప్పు. ఆ మాట అర్థరహితమైనవ్యాఖ్య.”