మాజేరు మృతులకు పరిహారం ఎప్పుడిస్తావ్ జగన్?

-చీము..నెత్తురు ఉన్నవారు అయితే పరిహారం అందించాలి
-అధికారంలోకి వచ్చాక వారంలో చెక్కులు ఇంటికి పంపిస్తానన్నావ్..
-ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవటమే జగన్ నైజం..
-ప్రజలను అడుగడుగునా దగా..మోసం చేసిన జగన్
-మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ధ్వజం

చల్లపల్లి మండలం మాజేరులో జ్వరాల కారణంగా చనిపోయిన మృతులకు పరిహారం ఎప్పుడిస్తారని ముఖ్యమంత్రి జగన్ ను మాజీ ఉపసభాపతి ప్రశ్నించారు.

అవనిగడ్డలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజేరు మృతులకు మద్ధతుగా మచిలీపట్నంలో ఆందోళన చేసినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బాధితులను ఆదుకోదని విమర్శలు చేసి..అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే వారంలో పరిహారం ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

వారంలో పరిహారం ఇస్తానని నాలుగేళ్లు అయినా పరిహారం ఇవ్వలేదేమన్నారు. పరిహారం కోసం గ్రామస్థులు ఎమ్మెల్యేని అడిగితే విసుక్కున్నారనీ..సీఎం కార్యాలయం చుట్టూతిరిగామనీ..సజ్జలనూ కలిసినా పట్టించుకోలేదని తనతో చెప్పారని తెలిపారు.

మాట తప్పని..మడమ తిప్పని వారైతే పరిహారం ఇచ్చేవారని చెప్పారు.ప్రజలను జగన్ ఏవిధంగా మోసం చేశారో..నమ్మకంగా ప్రజలు ఎలా ఓట్లు వేశారో అనేందుకు ఈ ఉదంతం నిరూపణ అవుతుందన్నారు. చీము..నెత్తురు ఉన్నవారు అయితే మాజేరు వాసులకు పరిహారం అందించాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు.

Leave a Reply