– తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు
– బిజెపి అనైతికంగా పాలన చేయడం వలన పార్టీ పరాజయం పాలైంది
– ఓట్ల శాతం పెరుగుదలకు పోవడం వలన బిజెపి నష్టం జరిగింది
– కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా టికెట్లు ఇవ్వండి
– ఏ పార్టీ పాలన చేస్తే ఆ పార్టీని చీల్చడం పొరపాటు
– బీజేపీ పరాజయం ఒక హెచ్చరిక
– కార్యకర్తల మనోగతం గౌరవించినప్పుడే బీజేపీకి భవిత
– అనైతిక-అవినీతి పాలనే బీజేపీ ఓటమికి కారణం
– ప్రజల మనోభావాలు బేఖాతరు చేస్తే ఇలాంటి ఫలితాలే
మనం ఒకసారి నాలుగు సంవత్సరాల వెనకకు పోదాం. హస్తినాపురం ( న్యూ ఢిల్లీ) శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ 2/3 మెజారిటీతో గెలిచింది . కానీ లోకసభ ఎన్నికలలో ఏడు స్థానాలను బిజెపి పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది.కర్ణాటకలో బిజెపి పొరపాటు చేసింది. ఎందుకంటే ఇతర పార్టీల లో చీలిక తీసుకురావడం .. మరల వారికి మంత్రి పదవులు ఇవ్వడం వలన స్థానిక బిజెపి శాసనసభ్యులు ఉన్నప్పటికీ , వారికి విలువ గౌరవం ఇవ్వకుండా, పోయింది. కార్యకర్తలు ఆ ప్రాంతాల్లో పార్టీకి సానుకూలంగా మద్దతు ఇవ్వలేదు. ఇతర పార్టీ సభ్యులను మంత్రులు చేయడం వలన, అవినీతి మయం అయింది.కరోనా సమయ కష్టకాలంలో ప్రజలకు ఇబ్బందులు జరిగాయి .
అలాగే ధరలు పెరగడం వలన మధ్యతరగతి ప్రజలు, దరిద్ర నారాయణుల ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
ఇక్కడ జేడి పార్టీ కి 5 %. ఓట్లు తగ్గినాయి. ఆ పార్టీ వైఫల్యం చెందడం వలన కాంగ్రెస్ కి లాభం జరిగింది.బిజెపి కి 35% ఓట్లు తిరిగి పడ్డాయి. కాంగ్రెస్ 42 శాతం అంటే 5 శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయి. జేడీ పార్టీ ఓట్లు కాంగ్రెస్కు వేశారు ఆనాడు కాంగ్రెస్కు 37%, బిజెపికి 35 శాతం మాత్రమే, అదీ తేడా. మన దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీలు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయో, అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. అదే కాంగ్రెస్ కు లాభం జరిగింది. కాంగ్రెసులో అతిరథ మహానాయకులు ఉన్నారు.వారు ప్రజల్లో గుర్తింపు నేతలు.
బిజెపిలో పార్టీ నడిపే రథసారథి ప్రజలలో గుర్తింపు లేదు.ఎందుకంటే కర్ణాటకలో కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది . తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. బిజెపి అనైతికంగా పాలన చేయడం వలన పార్టీ పరాజయం పాలైంది. ఓట్ల శాతం పెరుగుదలకు పోవడం వలన బిజెపి నష్టం జరిగింది .కావున ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
ఏదైనా పాలనను అధికార దర్పముతో తీసుకోవడం బిజెపికి నష్టం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ పాలన చేస్తే ఆ పార్టీని చీల్చడం పొరపాటు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. బీజేపీ పరాజయం ఒక హెచ్చరిక లాంటిది.
మరలా బిజెపి కార్యకర్తలను సీనియర్ రాజకీయ నాయకులను గౌరవించడం.. వారి సహాయ సహకారాలు తీసుకోవడం.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ నాయకులకు టికెట్లు ఇవ్వండి .
కేంద్ర పార్టీ నాయకులు వెంటనే పార్టీ సమావేశం జరిపి, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా, నాయకులకు టికెట్లు ఇవ్వండి. రెండు లోకసభ స్థానాల నుండి ఈనాడు 320కి పైగా సభ్యులు ఉన్న పార్టీ కి ఎందుకింత పరాభవం జరిగింది? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది.
ఈనాడు ప్రజలు చైతన్యవంతులు.పొరపాటులు సరిదిద్దుకోవాలి. పార్టీ కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి. నిర్ణయాలను పైనుంచి రుద్దితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇకనయినా.. స్థానికుల మనోభావాలు గుర్తించండి. జెండా మోసిన కార్యకర్త మనోగతం వినండి. జనంలో బలం లేనివారిని నేతలుగా తయారుచేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అంతిమంగా కార్యకర్తలు-జనం మాట వినండి.. పైవారికి భజన చేసే వారు, స్థానిక రాజకీయాలు తెలియని వారు ఇచ్చే నివేదికల బట్టి కాదు! అప్పుడే బిజెపి విజేతగా నిలబడుతుంది.

(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )