Suryaa.co.in

Andhra Pradesh

పేర్ని నానిపై కేసు నమోదు

పోలీసుస్టేషన్‌పై దాడి చేసి హంగామా సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద చిలకలపూడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. బుధవారం వైసీపీ అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కానిస్టేబుల్‌ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా 144 సెక్షన్‌ అతిక్రమించారని, స్టేషన్‌లో ఫర్నిచర్‌ కూడా ధ్వంసం చేశారని అభియోగాలు మోపారు.

LEAVE A RESPONSE