Suryaa.co.in

Andhra Pradesh

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి

రాజంపేట: ఆదివారం ఆనందంగా ఇంట్లో బుడి బుడి అడుగులతో కేరింతలు కొడుతున్న చిన్నారి ఉన్నట్లుండి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అప్పటివరకు బిడ్డ నవ్వులు, అల్లరితో మురిపోయిన తల్లిదండ్రులు ఒక్కసారిగా తమ పేగు బంధం తెగిపోయిందనే వార్త తెలిసి గుండలు పగిలేలా రోదించారు.

విగతజీవిగా జీవిగా మారిన తమ బిడ్డ మృతదేహంపై పడి గగ్గోలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరులో చోటు చేసుకుంది. నిన్న ఆదివారం కావడంతో కృష్ణయ్య, మణి దంపతులు ఇంట్లో చికెన్ వండారు.

అయితే పొరపాటున కింద పడ్డ చికెన్ ముక్కను సుశాంక్ తినేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ముక్క పెద్దిగా ఉండటంతో గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికెన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతోనే చిన్నారి మరణించినట్లు ధృవీకరించారు.

LEAVE A RESPONSE