వేరుశెనగలు (పల్లీలు)(బాదం) 12గంటలు నానబెట్టి తినాలి.శరీరానికి కావల్సిన ప్రొటీన్లు రోజు గుప్పెడు పల్లీలు తినడం ద్వారా లభిస్తాయని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. టైంపాస్‌గా తినే పల్లీల్లో ప్రొటీన్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
గుప్పెడు పల్లీలు తింటే వచ్చే ప్రొటీన్ల బలం పావు లీటరు పాలు, రెండు కోడిగుడ్లు తిన్నా కూడా రాదు. పాలలోని ప్రొటీన్లు, నెయ్యిలోని కొవ్వు పదార్థాలు రెండూ ఇందులో లభిస్తాయి.పాలు, బాదంపప్పు, నెయ్యి తింటే లభించే పోషక పదార్థాలు కేవలం రోజూ పల్లీలు తినడం ద్వారా శరీరానికి అందుతాయి.శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉన్న పల్లీలను ఏ కాలంలో తిన్నా మంచిదే.
ముఖ్యంగా వానాకాలం, చలికాలంలో వీటిని ఎక్కువగా తింటారు. ఇందులో దగ్గును నివారించే గుణం కూడా ఉంది. ఇవి ఊపిరితిత్తులకు కూడా బలాన్ని చేకూరుస్తాయి. ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిది.జీర్ణశక్తిని పెంచి, రక్త హీనతను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఇందులో ప్రొటీన్లు, కేలరీలు, విటమిన్ ‘ కే’, విటమిన్ ‘ఇ’, విటమిన్ ‘బి’ ఉంటాయి.ఇతర స్నాక్స్ తో పోల్చితే పల్లీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది.ఇతర హైక్యాలరీ, ఫ్యాట్ ఫుడ్స్ తినాలనిపించదు. దాంతో మీరు బరువు పెరగరు.పల్లీల్లో మోనోశాచ్యురేటెడ్ ఫాలీ అన్ శ్యాచురేటెండ్ ఫ్యాట్స్ ఉన్నాయి.
ముఖ్యంగా ఓలిక్ యాసిడ్ రక్తంలో ఎల్ డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి, మంచి కొలెస్ట్రాల్ (ఎచ్ డిఎల్) ను పెంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంతేకాదు కరోనరీ ఆర్టీ డిసీజ్ ను నివారిస్తుంది. స్ట్రోక్ నివారించి హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ ను ప్రోత్సహిస్తాయి. పల్లీల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్, స్ట్రోక్‌తో పాటు ఇతర హార్ట్ సమస్యల రిస్క్ ను తగ్గిస్తాయి. పల్లీలలో ఉండే ట్రైప్టోఫోన్ డిప్రెషన్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
ఇందులో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు అధికంగా ఉండే ఫైటో స్టెరోల్ బీటా స్టెరోల్ అధికంగా ఉంటాయి. ఇవి ట్యూమర్ గ్రోత్‌ను నివారిస్తాయి. పీనట్స్ తినే 27 శాతం నుండి 58 శాతం వరకూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని యునైటెడ్ స్టేట్స్ పరిశోధనల్లో కనుగొనబడినది.ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది. మ్యాంగనీస్, మినిరల్స్ ఎక్కువగా ఉండే పల్లీలను తినడం వల్ల 21 శాతం డయాబెటిస్ రిస్క్ ఉండదని పరిశోధనల్లో కనుగొన్నారు. ఎవరైతే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కొద్దిగా పల్లీలు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. పల్లీల్లో హై క్వాలిటి ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి.
ఇవి ఫెర్టిలిటినిపెంచుతాయి.అలాగే పుట్టే పిల్లలో ఎలాంటి లోపాలు లేకుండా పుడుతారు. అందు వల్ల ప్రెగెన్సీ ప్లాన్ చేసుకునే వారు పీనట్స్ తినడం వల్ల హెల్తీ బేబిని పొందవచ్చు. ప్రెగెన్సీకి ముందు, ప్రెగెన్సీ సమయంలో పల్లీలు తినడం వల్ల పుట్టే పిల్లల్లో 70 శాతం వారిలో ఎలాంటి లోపాలు ఉండవు.ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండవు.చర్మ సంరక్షణకు పల్లీలు ఎంతగానో ఉపయోగపడుతాయి.ఇందులో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ , రివర్ట్రోల్ చర్మానికి కావల్సిన తేమను అందించి.. చర్మాన్ని తేమగా, కాంతివంతంగా మార్చుతాయి. మరెందుకు ఆలస్యం రోజూ గుప్పెడు పల్లీలు తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.వేరుశనగ 12గంటలు నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి.