ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి

-ఏ సంఘము ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా స్వచ్ఛందంగా కదిలిన ఉపాధ్యాయ దంపతులు కుటుంబాలు
-13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు జరపటమే సింగిల్ పాయింట్ ఎజెండా..
-వందలాదిగా తరలివచ్చిన మహిళా ఉపాధ్యాయులు వారి పిల్లలు…
-మౌన దీక్షలో పాల్గొన్న 700 మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు, పిల్లలు…
-నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్లలో సుమారు 600 మంది ఉపాధ్యాయులను నిర్బంధించిన పోలీసులు..
-ఉపాధ్యాయ దినోత్సవ రోజు పోలీసులు చేసిన ఘన సత్కారం అని వాపోతున్న ఉపాధ్యాయ దంపతులు…

13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నందు దంపతులు చేపట్టిన మౌన దీక్ష విజయవంతంగా జరిగింది.

రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు, వారి పిల్లలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు మౌన దీక్షలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఈ దీక్ష ఒక అద్భుతంగా పలువురు భివర్ణిస్తున్నారు.

ఏ ఉపాధ్యాయ సంఘం అండదండలు లేకుండా స్వచ్ఛందంగా స్టేట్స్ స్పౌస్ ఫోరం పేరుతో గడిచిన ఎనిమిది నెలలుగా వివిధ రూపాల్లో ఉపాధ్యాయ దంపతులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు. వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ భర్త ఒక జిల్లా భార్య మరొక జిల్లాలో ఉపాధ్యాయ దంపతులు విధులు నిర్వహిస్తున్నారు.

ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఉపాధ్యాయ దినోత్సవం రోజు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు , మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు . మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్సీ కార్యాలయాన్ని ఉపాధ్యాయ దంపతులు చేరుకోవడం మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో మొదలైన ఉపాధ్యాయుల సమీకరణ నిమిషాల వ్యవధిలోనే వందలు వెయ్యి దాటింది.

పోలీసుల దురుసు ప్రవర్తనకు నోచుకున్న ఉపాధ్యాయులు ..
మౌన దీక్ష నిర్వహించుకుని, ప్రభుత్వంవారికి, అధికారులకు తమ గోడు చెప్పుకొని వెళ్లిపోతామన్న వినకుండా పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారని, ఉపాధ్యాయ దినోత్సవం రోజు పోలీసులు తమకు చేరిసిన గురుపూజ ఇదేనని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. కనీసం మహిళా ఉపాధ్యాయులు చిన్నపిల్లలు ఉన్నారు అనే కనికరం కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించారు. దొంగలతో నేరస్తులతో ప్రవర్తించిన మాదిరిగా ఉపాధ్యాయు లతో మాట్లాడడం బాధ కలిగించిందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందారు.

సంఘీభావంగా వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పక్షాలు….
ఒకవైపు రాష్ట్రంలో గురుపూజోత్సవం ప్రభుత్వంగా లాంచనంగా నిర్వహిస్తూనే మరో పక్క ఉపాధ్యాయులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పలు ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పక్షాలు నిర్దోర్నంగా ఖండించాయి నిర్బంధించిన ఉపాధ్యాయులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే జరిపించాలని పునరుద్గాటించాయి.

మహిళా ఉపాధ్యాయునుల పోరాట పటిమ అద్భుతం….. గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులవుతుందంట….
అలా ఉంది ఈరోజు మౌన దీక్ష దగ్గర మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి …భర్త ఒక జిల్లాలో భార్య మరో జిల్లాలో వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి, 8 నెలలుగా నరకం అనుభవిస్తున్న మహిళాte ఉపాధ్యాయులు తమ పోరాట పటిమ ను ప్రదర్శించారు. వందలాదిగా తరలివచ్చిన మహిళా ఉపాధ్యాయులు మొక్కవోని దీక్షతో పోరాటంలో పాల్గొన్నారు. ఇక ఎంత మాత్రమూ ఈ యాతన అనుభవించలేమనే స్పష్టత మహిళా ఉపాధ్యాయుల చైతన్యంలో కనిపించింది .

13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడం తప్ప ప్రభుత్వం ముందు మరో అవకాశం లేదని స్పష్టంగా, ముక్తకంఠంతో ఉపాధ్యాయునుల గర్జించింది
కెసిఆర్ పైనే నమ్మకం. ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు ముందు నుంచి సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నారని కొద్దిమంది అధికారులు చేసిన పొరపాటు వల్ల ఈ పరిస్థితి దాపురించిందని స్పౌజు ఉపాధ్యాయులు నమ్ముతున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి విషయం తెలుసుకొని వెంటనే తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావంతో ఉన్నారు.

Leave a Reply