• పంచాయతీ రాజ్ ఈఎన్ సీగా సుబ్బారెడ్డి నియామకం, జగన్ రెడ్డి చేసిన అతిపెద్ద దళితద్రోహం.
• సీనియారిటీ జాబితాలో తొలిస్థానంలో ఉన్న బాలూనాయక్ ని కాదని, 5వస్థానంలో ఉన్న సీ.వీ.సుబ్బారెడ్డిని జగన్ ఈఎన్ సీగా నియమించడంపై దళితసంఘాలు స్పందించాలి.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓట్లకోసంతప్ప, పదవులకు పనికిరారన్న దురభిప్రాయంతో ఉన్న జగన్ కు పంచాయతీరాజ్ శాఖలోని దళితులు బుద్ధిచెప్పాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ రాష్ట్రంలో దళితజాతిపై కక్షకట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులతో వారిపై కక్షతీర్చుకుంటున్న జగన్ రెడ్డి, ప్రభుత్వశాఖల నియామకాల్లోనూ ఎస్సీ, ఎస్టీలను పూచికపుల్లల్లా తీసిపడేయడం బాధాకరమని, రెడ్లసేవలో తరిస్తూ, దళితుల్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పిలుపు నిచ్చారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“దళితుల్నిమభ్యపెట్టి, వారిఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే దళితులు, గిరిజనుల్నే నట్టేటముంచాడు. చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు ముఖ్యమైనస్థానాలు, కీలక పదవులన్నీ తనవర్గానికే కట్టబెట్టాడు.
పంచాయతీ రాజ్ ఈఎన్ సీగా రెడ్డిని నియమించడం దళితుల్ని అవమానించడమే…
సీనియారిటీ ప్రకారం ఎస్సీ,ఎస్టీ అధికారులకు రావాల్సిన పదవుల్నికూడా జగన్ రెడ్డి రెడ్లకే కట్టబెడుతున్నాడు. పంచాయతీ రాజ్ శాఖలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) గా నియమించిన సీ.వీ.సుబ్బారెడ్డికి ఉన్న అర్హతేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి. ఏఅర్హతతో తనవర్గం వ్యక్తిని జగన్ ఆ పదవిలో నియమించాడని దళితుల తరుపున ప్రశ్నిస్తున్నాం.
సుబ్బారెడ్డికి ముందు ఈఎన్ సీగా ఉన్న బీ.సుబ్బారెడ్డి కూడా సక్రమంగా ఆ బాధ్యతల్లోకి రాలేదు. అప్పుడకూడా ప్రభుత్వం లోపాయికారీ వ్యవహారంతోనే అతన్ని నియమించింది. తాజాగా జరిగిన ఈఎన్ సీ సీ.వీ.సుబ్బారెడ్డి నియామకంపై పంచాయతీ రాజ్ శాఖలోని ఉద్యోగులు స్పందించాలి. నిబంధనలుకాదని, తనవర్గానికి జగన్ రెడ్డి ఎలా మేలుచేస్తాడో ప్రశ్నించాలి.
ప్రభుత్వంలోని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగసంఘం నేతలకు పంచాయతీ రాజ్ ఈఎన్ సీ నియామకంలో దళితులకు జరిగిన అన్యాయం కనిపించడంలేదా? సీనియారిటీ జాబితాలో తొలిస్థానంలో ఉన్న బాలునాయక్ ని కాదని, ఎక్కడో 5వస్థానంలో ఉన్న సుబ్బారెడ్డిని జగన్ రెడ్డి ఈఎన్ సీ గా నియమించడం ముమ్మాటికీ దళితుల్ని అవమానించడం.. అణచివేయడ మే. ఎస్సీ, ఎస్టీ అధికారులనుకాదని రెడ్లకు అగ్రతాంబూలం ఇవ్వడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కాదా?
ఈఎన్ సీ నియామకంలో దళితుల్ని అవమానించిన జగన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టాలి
అంబేద్కర్ గారు సామాజికఅంతరాలు తొలగించడంకోసం రాజ్యాంగంలో దళితులకు హక్కులిస్తే, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హక్కులన్నీ హరింపబడుతున్నాయి. సీనియారిటీ ప్రకారం ముందున్న బాలునాయక్ ని కాదని, సుబ్బారెడ్డికి ఈఎన్ సీ పదవిఇవ్వడం ముమ్మాటికీ ఎస్టీఎస్టీ అట్రాసిటీ కిందకే వస్తుంది. ఈఎన్ సీ నియామకం ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిందే. ఆయనకు తెలియకుండా జరిగిందని చెప్పి, దళితుల్ని ఏమార్చాలని చూస్తే కుదరదు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లలో 95శాతం రెడ్లే ఉన్నారు. డీఎస్పీ ప్రమోషన్లలో 40 శాతం ప్రాధాన్యత రెడ్లకే ఇచ్చారు. అచ్చెన్నాయుడిపై కక్షసాధించడంకోసం, టెక్కలి డీఎస్పీడా హరినాథరెడ్డిని నియమించారు. జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు రెడ్లకే 800పదవులు కట్టబెట్టాడు. టీటీడీ ఛైర్మన్ మొదలు, సలహాదారులు, ఇతరత్రా పదవుల్లో 800మంది రెడ్లున్నారు. కడపజిల్లానుంచే సకలశాఖమంత్రి సజ్జల, డీజీపీ, సీఎస్ పదవుల్ని రెడ్లకు కట్ట బెట్టాడు. అన్నిఅర్హతలు,సమర్థత ఉండి కూడా ఎస్సీ,ఎస్టీలు, బీసీ, మైనారిటీ అధికారులు జగన్ అధికారబలంతో అణచివేతకు గురవుతున్నారు.
నామ్ కే వాస్తే పదవులు, దళితులు, బీసీలు, మైనారిటీలకు ఇవ్వడం వారిని ఉద్ధరించడమా?
ఉన్నతమైనపదవులు, ముఖ్యమైన స్థానాలన్నీ రెడ్లకు ఇస్తున్న జగన్ రెడ్డి, నామమాత్రపు, ఎందుకూపనికిరాని స్థానాల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీలు, బీసీలను నియమిస్తూ, వారిని ఉద్ధిరిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అడిగినవాటిలో 90శాతం పనులు చంద్రబాబు పూర్తిచేశారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10శాతం మేలుచేయకపోయినా, ఆయావర్గాలు స్పందించలేని దుస్థితిలో ఉన్నాయి.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 37మందికి డీఎస్పీ ప్రమోషన్లుఇస్తే, 35 మంది చంద్రబాబుసామాజికవర్గం వారే ఉన్నారంటూ, ఢిల్లీనుంచి గల్లీవరకు జగన్ రెడ్డి దుష్ప్రచారం చేశారు. తరువాత అధికారంలోకి వచ్చాక వైసీపీప్రభుత్వంలోని హోంమంత్రే అది అబద్ధమని అసెంబ్లీసాక్షిగా ఒప్పుకున్నారు. అబద్ధాలను నిజాలుగా నమ్మించడంలో జగన్ రెడ్డిది అందెవేసిన చెయ్యి” అని ఆనంద్ బాబు స్పష్టంచేశారు.