– సోయి లేని వాళ్లకు సీఎం పదవి ఇస్తే సొల్లు తప్ప ఏమీ లేదు
– 18 నెలల్లో నే కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ దొబ్బింది
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: అబద్దాలు చెప్పి చెప్పి ఎం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్ధం కావడం లేదు. దిక్కు మాలిన,దివాళా కోరు మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ తెలంగాణ కాంగ్రెస్ లోనే ఉన్నారు. పీసీసీ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అబద్ధాల ప్రచార కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అందులో మెంబెర్స్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొంగులేటి ,సీతక్క ఎంపీ చామల,ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ,అద్దంకి దయాకర్ ,సామరామ్ మోహన్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు.
అబద్దాలు చెప్పిచెప్పి రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్ని అబద్దాలు చెబితే అన్ని పదవులు వస్తాయని కాంగ్రెస్ నేతలు రేవంత్ ను చూసి అబద్దాలు మాట్లాడుతున్నారు. దొంగ మాటలు. నోరు తె రిస్తే అబద్దాలు. బ్యాగులు ఎట్లా దొంగించలేనిది కాంగ్రెస్ వాళ్లను చూసి నేర్చుకోవాలా ?. బెసిన్ లా గూర్చి తెలియని వాళ్ళ దగ్గర బేసిక్స్ నేర్చుకోవాలా?
కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ఉద్యమ ద్రోహులు. చంద్రబాబు తో చేతులు కలిపి తెలంగాణ ఉద్యమ్యాన్ని నీరు గార్చే ప్రయత్నం చేశారు. మాటకు మాట. ప్రశ్నకు ప్రశ్న తోనే సమాధానం చెబుతాం. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ వెంట హరీష్ రావు ఉన్నారు. మనిషివా రేవంత్ రెడ్డి వా అని బయట తిట్టే పరిస్థితి ఏర్పడింది. మేము కూడా తిట్టగలం .మాకు బాషా రాకనా?మేము తెలంగాణ వాళ్ళం..
రాబోయే తరాల వాళ్ళు రాజకీయం అంత గలీజ్ అయ్యిందని కాంగ్రెస్ నేతల తీరు ను చూసి అంటున్నారు. మీ బూతులు చూసి రాజకీయాలకు రావొద్దు అనుకుంటున్నారు.కేసీఆర్ ఏం చేయలేదు అనే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కట్టించిన సచివాలయం,కమాండ్ కంట్రోల్,కలెక్టర్ కార్యాలయాలు,ఎస్పీ కార్యాలయాల్లో ఎందుకు కూర్చుంటున్నారు.
ఆనాడు,ఈనాడు జై తెలంగాణ అన లేదు.బాలకృష్ణ,అల్లు అర్జున్ లాంటి వాళ్ళు జై తెలంగాణ అన్నారు.రేవంత్ రెడ్డి ఎందుకు జై తెలంగాణ అనరు ? రేవంత్ రెడ్డి కి ఏ పార్టీ కి అయిన డిప్యూటేషన్ పై వెళ్తాడు.ఆయన డిప్యుటేషన్ సీఎం. తెలంగాణ ప్రజల దుఃఖాన్ని అర్ధం చేసుకున్న నాయకుడు కేసీఆర్.
బనకచర్ల కట్టుకోమని చంద్రబాబు కి డైరెక్ట్ గా ఇండైరెక్టు గా రేవంత్ మద్దతు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. ఎప్పటికీ తెలంగాణ ద్రోహినే..మీరు ఆంధ్ర బాబులే. మీ దిమాక్ ఎంత..హాఫ్ నాలెడ్జ్ ని చూసి నేర్చుకోవాలా? రాజకీయంగా కేసీఆర్ ని ఎదుర్కొలేక తిట్ల రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన బిఅరెస్ ఉంది .కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మీద కోపం ఉంటే ప్రజల మీద తీర్చుకుంటున్నారు.
18 నెలల్లో ఇచ్చిన హామీల పై చర్చ కి సిద్ధమా? దమ్ము దైర్యం ఉంటే చర్చ పెట్టండి. కాళేశ్వరం కూలలేదు .కాంగ్రెస్ నేతల మెదళ్ళు కూలిపోయాయి. మీ కాంగ్రెస్ 18 నెలలో పాలన లో ఎన్ని కూలయో చూసుకోండి. కాంగ్రెస్ అంటే కరఫ్షన్. నా ఇంట్లో వాళ్లకు బర్త్ సర్టిఫికెట్ కి లంచం అడిగారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.
కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చింది .తెలంగాణ రాకపోతే నీకు సీఎం పదవి ఎక్కడిది రేవంత్ రెడ్డి. రోజు కేసీఆర్ ఫోటో కి మోక్కి బయట కి వెళ్ళండి..మీకు బుద్ధి వస్తుంది. ద్రోహులు ఎవరో తెలంగాణ వాదులు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలిసింది. ప్రజలకు భరోసా కల్పించండి.
60 ఏళ్ల వెనుక కి వెళ్లిన తెలంగాణ ని 10 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించినమ్.ఈ ఐదేళ్లలో మరో ఇరవై యేళ్లు తెలంగాణ వెనక్కి వెళ్లడం ఖాయం. స్థానిక సంస్థల్లో మీకు అభ్యర్థులు దొరుకరు .మాకు కాదు. మాకు నాయకుడు ఇక్కడే ఉన్నారు .మీలా ఢిల్లీ లో లేరు. దొంగ ఎప్పటికి అయిన దొరకాల్సిందే..ముసుగు తొందరలో తొలిగిపోతుంది.
ప్రెస్ మీట్ లో మన్నె గోవర్ధన్ రెడ్డి ,కె .కిషోర్ గౌడ్ ,తుంగ బాలు ,గోసుల శ్రీనివాస్ యాదవ్ ,సుమిత్రానంద్ ,కరాటే రాజు నాయక్ పాల్గొన్నారు.