Suryaa.co.in

Andhra Pradesh Crime News

తల్లి పీక మీద కాలేసి తొక్కిన కర్కశుడు

ప్రాణాపాయ స్థితిలో తల్లి

కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న యువకుడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి, కాళ్లతో తన్నుతూ తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ, మానవత్వం లేని మృగంగా ప్రవర్తించాడు. తాగిన మత్తులో ఈ యువకుడు తన తల్లిని ఇలా చిత్ర హింసలకు గురిచేయడంతో ఆ తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగం పై, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలిసుకున్న వారి బంధువులు వృద్దురాలి ని యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లినే కడతేర్చాలని చూసాడు ఈ కన్న కొడుకు. మద్యం మత్తులో వృద్ధురాలు అయిన తన తల్లిని పీక మీద కాలు వేసి పలుమార్లు తొక్కి కడతేర్చాలని ప్రయత్నం చేసిన ఈ సంఘటన, కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామం ఉప్పరపేట ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.

లక్ష్మికి ముగ్గురు కుమారులు కాగా, చాలా కాలం నుండి పెద్ద కుమారుడు ఇంటి వద్ద యానంలో ఉంటున్న తల్లిని రెండో కుమారుడైన వెంకన్న ఉంటున్న పల్లిపాలెం గ్రామానికి 20 రోజుల క్రితం తీసుకువచ్చినట్లు బంధువులు తెలిపారు. ఇది ఇలా ఉండగా తల్లిని రోజు చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో, పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చిన వెంకన్న.. కన్న తల్లి పీక మీద కాలు పెట్టి పలుమార్లు దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికులు యానం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మానవత్వం మాతృత్వం అనే పదాలకు విలువ తెలియని ఈ కర్కశ కొడుకు పై పోలీసులు చర్య తీసుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.

LEAVE A RESPONSE