బీజేపీకి కమ్యూనిస్టులు ముసుగులా?

– కమ్యూనిస్టులపై నమ్మకం పోతోంది

కమ్యూనిస్టులు కూడా దేశానికి అవసరం అని భావించే వాళ్లు, దేశంలో కోట్లాదిమంది వున్నారు. కానీ రోజు రోజుకూ వీళ్ల పరిస్థితిని, వీళ్ల యాక్టింగ్ చూస్తుంటే అయ్యో అని కూడా ఎవరూ అనలేరు. పైకి మమత బిజెపి భీకరంగా కొట్టుకొన్నట్లు రాజకీయంగా నటిస్తే, బెంగాల్‌ను దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టులు.. మమత- బిజెపి లను 1 & 2 స్థానాల్లో నిలిపారు.

దీనికి తోడు ఈ మధ్య లఘువులు బిగువులు నేర్చారు. ఈ ఉప ఎన్నికలకు మాత్రం KCRకు మద్దతు ఇస్తారట. కేసీఆర్ ఎవరు? రెండో స్థానంలో వున్న కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టడానికి బిజెపి తో డ్రామా గొడవలు ఆడుతున్నారు. బెంగాల్లో మాదిరిగానే తెలంగాణలో బిజెపి ని రెండో స్థానానికి తేవడానికి కృషి చేస్తున్నారు. అలాంటి కేసీఆర్ కు కమ్యూనిస్టులు మద్దతు ఇస్తారట. అసలు నిన్నటి దాకా ఈ కమ్యూనిస్టులను ప్రగతి భవన్‌ గేటు దరిదాపుల్లోకి కేసీఆర్ రానీయలేదు. ఇప్పుడు కేసీఆర్ ఏమి ఇచ్చాడో గానీ.. ఆహా ఓహో అంటున్నారు.

ఇక ఆంధ్రాలో జగన్.. రాజ్యాంగం పట్ల గౌరవ నిబద్ధతలతో వున్నట్లు మాట్లాడుతున్నారు. జగన్‌.. నువ్వు మోదీ వైపా.. రాజ్యాంగాన్ని కాపాడే వైపా అని అడుగుతున్నారు. కేసుల కోసం మోడీ కాళ్లకు దండం పెడుతున్న జగన్‌ దయనీయమైన పరిస్థితి వీరికి కనిపించడం లేదు అని, మనం అమాయకంగా నమ్మాలి.

ఈ మధ్య కేసీఆర్ , మమత, ఒవైసీ & జగన్‌ల కంటే కూడాబిజెపి కి పెద్ద ముసుగులు ఈ కమ్యూనిష్టులా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం కేసీఆర్ , మమత, ఒవైసీలు బిజెపి తో పైకి కొట్లాడినట్లు కనిపిస్తారు. కానీ మోదీ షాలను చూస్తే వణికిపోతున్న జగన్ పరిస్థితి తమకు తెలియదన్నట్లు కమ్యూనిస్టులు అద్భుతంగా నటిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత వైఖరి వల్ల కమ్యూనిస్టులంటే దేశ ప్రజలకు నమ్మకం పోయింది. భావజాలం దగ్గర నుంచి ఆచరణ దాకా కమ్యూనిస్టుల్లో ఉన్నది నయ వంచన. వాళ్లను వాళ్లే మోసం చేసుకుంటూ జనాలను కూడా మోస చేస్తున్నారు. ఈరోజున కమ్యనిస్టులు అనగా ఎవరు అనే పరిస్థితి తెచ్చుకున్నారు.

రామ్మోహన్‌, జర్నలిస్టు

Leave a Reply