తెలుగుదేశం బిసి ల పుట్టినిల్లు
చిల్లకల్లు లో “జయహో బీసీ” సమావేశం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు లోని పాలకేంద్రం ఫంక్షన్ హాల్ నందు జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నెట్టెం శ్రీ రఘురాo, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య.
ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బీసీ ప్రజలు శ్రమజీవులని, చారిత్రకంగా గాని, వారసత్వపరంగా గాని ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థ వల్ల వారు అణచివేయబడ్డారని అన్నారు.
ప్రజల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో తమతోనే ప్రగతి సాధ్యమని నమ్మి బీసీల ఎదుగుదలే పార్టీ భావజాలంగా నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని తెలిపారు.
భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా “బీసీలకు రక్షణ చట్టం” తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిశ్చయించుకుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను అన్ని విధాలుగా అణచివేతకు గురి చేశారని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో గత 25 ఏళ్లుగా 34 శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్ ను 24 శాతానికి తగ్గించి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు బీసీలకు రద్దు చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో 75 మందికి పైగా బీసీ నాయకులు హత్య చేయబడ్డారని, 2540 మంది దాడులకు గురయ్యారని, 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు.
70 వేలకు పైగా బిసి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని, 13 బీసీ భవనాలకు కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. నాటి తెలుగుదేశం పార్టీ హయాంలో బిసి పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్పులు, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ, కులవృత్తులు వారికి 90 శాతం సబ్సిడీతో పనిముట్లు పంపిణీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, చంద్రన్న పెళ్లి కానుక, తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్, చంద్రన్న బీమా వంటి పథకాలను అందజేసి బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని తెలిపారు.
మత్స్యకార, చేనేత, బోయ-వాల్మీకి, నాయి బ్రాహ్మణ, రజక, గీత కులాలు, కురుబ, యాదవ వంటి కులవృత్తుల వారికి అనేక పతకాలు ద్వారా చేయూతనందించడం జరిగిందని వివరించారు.
జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయకుండా వారిపై దాడులకు పాల్పడి ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు పాల్పడ్డారని, రానున్న ఎన్నికలలో బీసీలు ఐక్యమై వైసీపీని బంగాళాఖాతంలో కలిపి బీసీల ప్రగతికి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సభ కార్యక్రమం అనంతరం టీడీపీ బీసీ నాయకులు, ప్రజలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న, ఆవుల రామారావు, తాళ్లూరు వెంకటేశ్వర్లు, కర్రీ శేషగిరిరావు (చిన్న), గడ్డం హుస్సేన్, యలగాల నూకాలమ్మ, కన్నబోయిన రామలక్ష్మి,పేరం సైదేశ్వరరావు,బాడిస మురళీకృష్ణ, చెన్నుబోయిన చిట్టిబాబు, వల్లూరి మధుసూదన్ రావు, గొర్రెపాటి నరసింహారావు,పటా పంచల తిరుపారావ్, పోతర్లంక శిశి రమేష్, ఎనికె గోపి, షేక్ సుభాని గోట్టే నాగరాజు, సంగేపు బుజ్జిబాబు, ఇర్రి నరసింహారావు, దర్శి నరసింహారావు, వల్లపు శివరాం, నాయిని రజిని, యామర్తి బోస్ యాదవ్, పునుగుపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు