చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన వీరశివారెడ్డి, కొలికపూడి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు…తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పారు.

రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Leave a Reply