ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయించారు.

అంతకు ముందురోజు అర్ధరాత్రి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిపోగా తుంటికి గాయమైంది. ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఊతకర్ర సహాయంతో నడుస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గజ్వేల్‌లో కేసీఆర్ వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో ఆయనకు 1,11,684 ఓట్లు పోలయ్యాయి. 45వేలకుపైగా మెజారిటీ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నుంచి గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు.

Leave a Reply