ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం

– పెన్షన్ దారులు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు
– ప్రజావాణిలో ఇప్పటివరకు 22 వేల అప్లికేషన్స్
– డేటా కలెక్షన్ తర్వాతే గైడ్ లైన్స్
– మంత్రి శ్రీధర్ బాబు
– జీహెచ్ ఎం సి పరిధిలో చేపట్టబోయే ప్రజా పాలన పై బంజారా భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీదర్ బాబు సమీక్ష.. పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

ప్రజలు స్వేచ్చగా వచ్చి అధికారుల దగ్గర సమస్యలను తెలియజేస్తున్నారు. ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాం.నగరంలోని ఆరు జోన్లు, ముప్పై సర్కిల్స్ పరిధిలోని ప్రజల వద్దకు అధికారులు వెళ్లి డేటా కలెక్షన్ చేస్తారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కనుక ప్రతి డివిజన్ లో నాలుగు ప్రాంతలలో టీం లీడర్ లను అందుబాటు లో ఉంచాము.టీం లీడర్ తో పాటుగా ఏడుగురు సభ్యులు ఉంటారు.

మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. ప్రతి వార్డు కు టైం టేబుల్ ఇచ్చాము. డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు టైం టేబుల్ ఉంటుంది.ప్రజా ప్రతినిధులు ఆ వార్డులలో సమాచారం ఇస్తారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవకాశం ఇస్తాము. ప్రతి వార్డుకు ఇంచార్జీ లను కేటాయించాము. ఆరు గ్యారెంటీ లను తప్పకుండా అమలు చేస్తాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 48 గంటల్లోనే రెండు గ్యారంటీ లను అమలు చేసాము. ప్రజా భవన్ లో ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నరు. మేము ప్రజా సేవకులం.

నాలుగు కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేశారు:  మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాము.మీకు స్కీమ్ వర్తిస్తుంది అంటే దర్ఖాస్తు చేయండి. ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇస్తాము. ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేశారు. మిగతా గ్యారెంటిలను ఈ దరఖాస్తుల ఆధారంగా చేస్తాము. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి లో అందరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు న్యాయం జరగాలి అన్నదే మా ధ్యేయం డేటా కలెక్షన్ తర్వాతే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తాము. పెన్షన్ దారులు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజావాణిలో ఇప్పటివరకు 22 వేల అప్లికేషన్స్ వచ్చాయి.

Leave a Reply