ఒక్క నిజమైన పోరాటం అన్నా జగనన్న చేశారా?

– బీజేపీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు
– ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా బీజేపీ రాజ్యమేలుతోంది
– టీడీపీ, వైసీపీ, జనసేనలకి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లే
-నెల్లూరు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
– ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఏపీ 11లక్షల 50 వేల లక్షల కోట్ల రూపాయల అప్పుకి చేరిపోయింది. 8లక్షల కోట్లు అప్పు వైసీపీ తెచ్చింది… రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలి.పోలవరం పూర్తి చేసిందా…? అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఓ మెట్రో అయినా వచ్చిందా? బీజేపీ కి వైసీపీ, టీడీపీ కి ఉన్న పొత్తుల వల్ల రాష్ట్ర అభివృద్ధి సూన్యంగా మారింది. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాంగ్రెస్ ఇస్తామంటే పదేళ్ళు బీజేపీ ఇస్తానంది.

చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని మంత్రి పదవులు తీసుకుని ప్రత్యేక హోదా వదిలేసారు. జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి రాగాలు తీశారు.ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తామన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క నిజమైన పోరాటం అన్నా జగనన్న చేశారా?

బీజేపీకి బానిసలుగా టీడీపీ, వైసీపీ మారిపోయింది. పోలవరం వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్టు. పోలవరం గురించి అటు చంద్రబాబు, ఇటు జగనన్న పట్టించుకోలేదు. బీజేపీతో దోస్తీ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారు.అమరావతి రాజధాని అని చంద్రబాబు గ్రాఫిక్స్ లో చూపించారు.జగనన్న మూడు రాజధానులు అన్నారు… కనీసం ఒక్క రాజధాని కూడా లేదు. బీజేపీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు.

ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా బీజేపీ రాజ్యమేలుతోంది.వైఎస్సార్ పెట్టిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఏమైంది? యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. రైతులకు వైఎస్సార్ రుణమాఫీ చేశారు. ఇవాళ అప్పు లేని రైతు లేడు.సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతులకు గురైతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

ఎన్నికల సమయంలో అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ఇప్పుడు కూడా రాకుంటే మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది. నా పుట్టిల్లు కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నా. వైఎస్సార్ ఆశయాలని కాపాడే పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకుందాం. ఏపీ ప్రత్యేక హోదా పై రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక తొలి సంతకం పెడుతా అన్నారు.

ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ రావాలి… ప్రాంతీయ పార్టీలు వైసిపి, టీడీపీలని తరిమికొడుదాం. టీడీపీ, వైసీపీ, జనసేనలకి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లే. b అంటే బాబు, j అంటే జగన్, p అంటే పవన్…. వీళ్ళ ముగ్గుర్లోనే బీజేపీ ఉంది. 70 వేల కోట్ల విలువ జేసే గన్నవరం పోర్టుని 600 కోట్ల రూపాయలకు ఆదానికి జగనన్న అప్పజెప్పేశారు.30 ఏళ్ళకి ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేలా వైఎస్సార్ గన్నవరం పోర్టుని తెచ్చారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ కార్గో తరలిపోతే 10 వేల మంది రోడ్డున పడతారు.
ఫ్లెక్సీలని తొలగించారు…? మా కార్యకర్తలని బెదిరించారు. వైసిపి గూండాలే కాదు… కలెక్టర్ కూడా అడ్డుకుంటున్నారంటే వైసీపీకి భయం పట్టుకుంది అనే కదా?సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారంటే మీ వెన్నులో వణుకుపుడుతుంది అనే కదా? మేం రెడీ… మీరు రెడీనా?

Leave a Reply