Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో రెండు జాతీయ పార్టీలకు అంత సీన్ లేదు

-కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఆడుతోంది
-ఎన్నికల సమయంలో ఏ సీఎం ఒక పేరున్న వ్యక్తిని అరెస్టు చేయాలని అనుకోడు
-ఒకవేళ ప్రభుత్వ సంస్థలు యాక్షన్ తీసుకున్నప్పటికీ కోర్టులు నిర్థారిస్తాయి
-చంద్రబాబు జైలు శిక్ష పై సీఎం జగన్
-తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్ క్లేవ్ లో సీఎం జగన్

తిరుపతి: ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్‌ చేశారు.. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.. అందుకే చంద్రబాబు జైలులో 52 రోజులు ఉన్నారు. ఎన్నికల ముందు ఎవరు అపోజిషన్‌ నేతను అరెస్ట్‌ చేయాలని అనుకోరు.. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే అరెస్ట్‌ అయ్యారు

సీఎం జగన్‌తో రాజ్‌దీప్ సర్దేశాయ్ ముఖాముఠి ఇలా సాగింది…

ఎమ్మెల్యేలు ఎంపీలను ఎందుకు డ్రాప్ చేస్తున్నారు?
– ప్రతి పార్టీ తన సొంత సర్వేలను నిర్వహిస్తుంది. సర్వేలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేల రిపోర్ట్ సరిగ్గాలేదు. అందుకే ఇలా ముందుగా జాగ్రత్తపడుతున్నాం.

కేసీఆర్‌లా మీరు కూడా పొరపాటు చేయడం లేదు..చంద్రబాబు బీజేపీతో కలవాలని ప్రయత్నం చేస్తున్నారు.. మీరు పార్లమెంటులో ఇష్యూ బేస్డ్ పద్ధతిలో మద్దతు ఇస్తున్నారు దీన్ని ఎలా చూడాలి..?
– మేము కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధం కొనసాగిస్తాం. అదే సమయంలో ఇష్యూ బేస్డ్ పై మద్దతు ఇస్తున్నాం.

మీ సోదరి వైయస్ షర్మిలాను పీసీసీ చేశారు.. దీన్నెలా చూస్తున్నారు?
– కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ ఆడుతోంది. ఇది కాంగ్రెస్‌కు అలవాటైన పనే. రాష్ట్రాన్ని విడగొట్టింది. విభజించి పాలించు అనేది రాష్ట్రంలో చేసింది. మా కుటుంబంలో కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేస్తోంది. మా చిన్నాన్నను మా పై నాడు ఉసిగొల్పింది. కాంగ్రెస్ పార్టీ సమాధి అయ్యింది. వాళ్లు ఇంకా పాఠాలు నేర్వలేదు.

వైయస్సార్ లేకుండా 2004 2009లో కాంగ్రెస్ లేదు.. నీకు కోపంగా లేదా… బాధ లేదా?
– నాకు బాధ ఉన్నింది, అయితే దేవుడిపై భారం వేశాను. నేను దేవుడిని నమ్ముతాను.అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నేను జగన్ రెడ్డిని కలిసినప్పుడు … ఇప్పుడున్న జగన్ రెడ్డికి మధ్య మార్పు ఏంటి..?
– రాజ్ దీప్ మీరే బెటర్ జడ్జ్.

నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.. మీకు అదే తృప్తి ఇస్తుందా?
– నా పాదయాత్రలో నేను ఎంతో మందిని కలిశాను.వారి సమస్యలను తీర్చడంలో నాకు తృప్తినిచ్చింది

నా రికార్డు చూసే నాకు ఓటేయమని అడుగుతున్నారు.. ఏంటది..?
– నా పరిపాలన బాగుందని మీరు భావిస్తేనే నాకు ఓటెయ్యండని ప్రతి పబ్లిక్ మీటింగ్‌లో అదే చెబుతున్నాను.

నీ కాన్ఫిడెన్స్‌కు హ్యాట్సాఫ్ సీఎం గారు…అంత బోల్డ్ స్టేట్‌మెంట్ ఎవరూ ఇప్పటి వరకు ఇవ్వలేదు

LEAVE A RESPONSE