Suryaa.co.in

Andhra Pradesh

ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ

– రాహుల్ గాంధీ నీ తీసుకు వస్తా
– జింక్ ఫ్యాక్టరీ నీ వేదాంత కి ఇచ్చారు
– జింక్ ఫ్యాక్టరీ కాస్త రియల్ ఎస్టేట్ అయింది
– విశాఖ ఉక్కు కర్మాగారం నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
– విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి

విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాదు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. నేను రాహుల్ గాంధీ నీ తీసుకు వస్తా. రాహుల్ గాంధి తో మాట కూడా ఇప్పిస్తా.కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చ బోతోంది. ప్రైవేటీకరణ పై పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరుపున ఉదృతం చేస్తాం.

30 వేల కుటుంబాలు పక్షాన కొట్లడుతం. ఈ ప్రాజెక్ట్ నిలబడటానికి ఐరెన్ ఓర్ ఇప్పించేందుకు కృషి చేస్తాం. ఉద్యోగాలు రాని 8 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేలా పోరాటం చేస్తాం. సపోర్ట్ సిస్టం గా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది.

విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ లాభాల్లో ఉంది. 3 మిలియన్ టన్నులు ఉన్న ఉత్పత్తిని 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి కి పెంచారు. ఐరెన్ ఓర్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కి కాళ్ళు చేతులు విరిచేశారు.

నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు. ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ. ఇక్కడ ఉన్న జింక్ ఫ్యాక్టరీ నీ వేదాంత కి ఇచ్చారు. జింక్ ఫ్యాక్టరీ కాస్త రియల్ ఎస్టేట్ అయింది.

LEAVE A RESPONSE