బద్వేలు వైపు కన్నెత్తి కూడా చూడని సీఎం జగన్

– కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు
– రాష్ట్రంలో అనాగరిక పాలన
– బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్
బద్వేలు బిజెపి కార్యాలయంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రెస్ మీట్…
బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేక ఉంది. బద్వేలు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేదు. ప్రత్యేక అధికారులను, కేంద్ర బలగాలను ఉప ఎన్నికలో కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరాము. దానికి వారు సానుకూలంగా స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను వేసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కావాలనే బద్వేలు ఉప ఎన్నికకు ఇంచార్జ్ గా వైసీపీ నియమించింది. వైఎస్ కుటుంబానికి బద్వేలు ప్రజలు గెలిపించుకుంటూ వచ్చారు. కానీ బద్వేలు లో అభివృద్ధి శూన్యం.
30 సంవత్సరాల పాటు వైఎస్ కుటుంబ సభ్యులనే ఎన్నుకుంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గం లో వేల కోట్ల తో అభివృద్ధి చేసుకున్న సీఎం . బద్వేలు వైపు కన్నెత్తి కూడా చూడని సీఎం జగన్. ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశ్యం తో సీఎం బద్వేలు ప్రజలకు వరాల జల్లు కురిపించారు. సంక్షేమం తో ప్రజల్లోకి వెళ్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. సంక్షేమ పథకాల పై వైసీపీ శ్వేత పత్రం విడుదల చేయాలి.
కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు. రాష్ట్రంలో అనాగరిక పాలన సాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర చేసిన జగన్ ఇప్పుడు బంగ్లా కు పరిమితం అయ్యారు. ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు అన్యాయం. ఉప ఎన్నిక ద్వారా ఒక అవకాశం వచ్చింది. వైసీపీ బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ ని గెలిపించాలి.

Leave a Reply