గన్నవరం : రెండు వారాల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్ళిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అమెరికాలోని డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా బయలుదేరి వెళ్లిన ఆయన 17గంటల ప్రయాణం అనంతరం అమెరికాలోని డల్లాస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
17 నెలల సుదీర్ఘ విరామం అనంతరం, ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి తొలిసారి అమెరికా చేరుకున్న ఆయనకు ఎన్నారై టిడిపి నాయకులు, కార్యకర్తలు, తానా ప్రతినిధులు, యార్లగడ్డ అభిమానులు, ఎన్ఆర్ఐ తెలుగు యువత(డల్లాస్) నాయకులు పూలమాలలతో, పుష్ప గుచ్చాలు అందించి వెంకట్రావుకు ఘన స్వాగతం పలికారు.
స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు కార్యకర్తలను ప్రతి ఒక్కర్ని ఆప్యాయంగా పలకరిస్తూ ధన్యవాదాలు తెలిపిన అయన వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన టీడీపీ ఎన్ఆర్ఐ నాయకులు, కార్యకర్తల కు ఈ సందర్బంగా యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు.