స్త్రీ లేకపోతే జననం లేదు
స్త్రీ లేకపోతే గమనం లేదు
స్త్రీ లేకపోతే గమ్యం లేదు
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు
స్త్రీ లేకపోతే అసలు మనుగడే లేదు
స్త్రీ నీ గౌరవించండి
నుదుటిన బొట్టు, కళ్ళకు కాటుక ,చేతికి గాజులు, కాలికి గజ్జెలు ధరించడం మన హైందవ సాంప్రదయమే కాదు భారతీయ తత్వం అణువణువునా జీర్ణించుకొన్న ఇతర మతాల తత్వం కూడా . స్త్రీత్వానికి గౌరవంగా ధరించే వీటి గురించి నేను ఇపుడు ఈ పోస్ట్ పెట్టడానికి ఒక బలమైన కారణం , మహిళ అంటే ఎలాగూ గౌరవం లేదు , తన తల్లి తన చెల్లి తన కూతురు కూడా మహిళ అనే కనీస ఇంగిత జ్ఞానం నేడు సమజంలో కరవై పోయింది.
మర్మ స్థానం కాదు మానవతకు జన్మనిచ్చే పుణ్యక్షేత్రం , ఎర్రని తన రక్తాన్ని తెల్లని పాలుగ మార్చే రొమ్ములమీద ఏనాడో మీరు వేసిన లేత పెదవి ముద్ర గుర్తు మీకు ఎలాగూ లేదు, పవిత్రత శరీరానికి ఆపాదించి మహిళను తన వ్యక్తిత్వాన్ని పదే పదే కించపరచడం దాన్ని భరించడం కూడా మామూలైపోయింది మాకు . మహిళ అన్న గౌరవం లేని చులకన భావాల్ని నర నరాన ఎక్కించుకొన్న ఒక పెంపకం సరిలేని బూతులనే జీవనంగా మార్చుకొన్న ఒక మానసిక ఉన్మాది ఫేస్ బుక్ వేదికగా చేసుకొని ప్రతి మహిళ ఎంతో పవిత్రంగా కాలికి ధరించే గజ్జెల గురించి పెట్టిన పోస్టింగ్స్ చూసాక , ప్రాణం లేని కాలి గజ్జెను కూడా కేవలం వాటిని మహిళలు ధరిస్తారు కాబట్టి వాటిని కూడా హీనమైన భాషతో పెట్టిన పోస్టింగ్స్ చూసాను .
పెట్టిన వ్యక్తి ఎంతటి హీనమైన వాతావరణంలో పెరిగి ఉంటాడో , అతని తల్లి లేదా చెల్లి లేదా భార్య జీవన విధానం అలాంటిదే ఏమో వారు కాలికి గజ్జెలు కట్టుకొని ఆ గజ్జెల మోతతో రైల్వే స్టేషన్ కి వెళ్ళి సంపాదించిన డబ్బుతో ఈ మానసిక రోగి బ్రతుకు వెళ్ళబుచ్చిన వైనం అర్ధం చేసుకొన్న నాకు మొదట కోపం కట్టలు తెంచుకొన్నా ఒక విద్యావంతు రాలిగా తరువాత సదరు వ్యక్తి మీద అంతులేని జాలి సానుభూతి కలిగాయి . అర్ధం లేని ద్వేషం కారణం లేని పగ అది కూడా మహిళలు పవిత్రం గా స్త్రీత్వానికి ప్రతీకగా ధరించే కాలి గజ్జెల మీద బూతు పురాణం , జాలి కాక ఏఏనాలి ? పిచ్చా !!పొగరా !! అహంకారమా !!ప్రాణం లేని కాలి అలంకారం గజ్జెలకు కూడా రంకు తనం వ్యభిచారం అంటగట్టే ఉన్మాదమా !!
మహిళ మాట్లాడ కూడదు , పదిమందిలోకి రాకూడదు , ప్రశ్నించకూడదు , ఎదిరించకూడదు ,పురుషుడి కి ఎదురు రాకూడదు ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం మనువు మనుధర్మ శాస్త్రం లో ఉటంకించాడు ఆనాటి కాలమాన స్థితులను బట్టి . కానీ స్త్రీని ఎక్కడా ఇంతలా కించ పరచ లేదు . నేటి నవయుగ మనువు లు మహిళ మీద ఆ పాటి గౌరవం ఎలాగూ లేదు ,కుల మత ప్రాంతాలకు సంభంధం లేకుండా భారతీయ స్త్రీ కాలికి కట్టుకొనే గజ్జె మీద కూడా తమ ఉన్మాదాన్ని తమ ఉక్రోషాన్ని వెలిబుచ్చుతున్నారంటే ఎంతటి అఅపరిపక్వతతో బ్రతుకుతున్నారో అర్ధం అవుతోంది.
తల్లి , చెల్లి , అక్క , కూతురు అందరూ ఆడపిల్ల లే , అందరికీ ఒకే శరీర భాగాలు కానీ ఎవరి బంధాలు వాళ్ళవే , ఒకే శరీరం ఉందని వావి వరసలు లేకుండా కామ దృష్టి తో చూసే ఉన్మాద కుక్కలు మాత్రమే ఇలాంటి ప్రేలాపనలు చేస్తాయని నేను చెప్పగలను . అందుకే ఆ మెసేజెస్ కూడా చూసి వారి మొహం మీద ఖాండ్రించి ఉమ్మెయ్యాలని అప్పటికైన సిగ్గు తో అవమనం తో ఇటువంటి పనులు చెయ్యరని నా నమ్మకం.
– డా. వసుంధర
(సామాజిక ఉద్యమ కార్యకర్త)