– తాడేపల్లిలో పులివెందుల యువకుడు హల్‌చల్
– మానసిక పరిస్థితి పై పోలీసుల ఆరా
అమరావతి: జగన్ నా మేనమామ.. ఆయన్ను కలవాల్సిందే అంటూ తాడేపల్లిలోని ఎపి సీఎం క్యాంపు కార్యాలయం చెక్‌పోస్టు -4 వద్ద పులివెందుల యువకుడు శుక్రవారం హల్‌చల్ చేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన పేరు వైఎస్ సుబ్రహ్మణ్వేశ్వర్‌రెడ్డి అని.. సీఎంను కలవాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో యువకుడిని విచారించగా తన స్వస్థలం పులివెందుల అని కాసేపు.. మరోసారి శ్రీ కాళహస్తి అంటూ యువకుడు సమాదానమిస్తున్నాడు. దీంతో అతడి మానసిక పరిస్థితి పై పోలీసులు ఆరా తీస్తున్నారు.