-ఇరు దేశాల ప్రజలకు సమానమైన ఆరోగ్య అవకాశాలను కల్పించడమే ధ్యేయం
-డాక్టర్ దువ్వూరు ద్వారకానాధరెడ్డికి ప్రత్యేక సేవా అవార్డు
-ప్రెసిడెంట్ డాక్టర్ అనుపమ గొటిముకుల
విజయవాడ : ప్రతి భారతీయుడు గర్వించేలా ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) 40వ వార్షిక సమావేశాన్ని టెక్సస్ రాష్ట్రం శాన్ అంటోనియో నగరంలో జూన్ 23 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ అనుపమ గొటిముకుల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని, దీనికోసం కన్వెన్షన్ చైర్ డాక్టర్ జయేష్ షా, సిఇఓ అడివి వెంకీ భారతదేశంలో వైద్యవిద్యను అభ్యసించి ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం తొలినాళ్ళలో అమెరికా వెళ్ళిన వాళ్ళు అనేక రకాలైన వివక్షలకు గురయ్యారన్నారు. వాటిని అధిగమించి గౌరవంగా అమెరికా రాష్ట్రాల్లో నిలబడటానికి వైద్యులంతా కలిసి 1980 కాలంలో ఏర్పాటు చేసుకున్నదే ఆపి (అమెరికన్అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అని తెలిపారు. ఈరోజున అమెరికా నగరంలో లక్ష మంది వైద్యులకు అండగా, వెనుదన్నుగా నిలిచిందన్నారు. ఆపి ద్వారా ప్రజలందరికీ సమానమైన వైద్య సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించాలని అమెరికా, భారత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్స్ ప్రధానంగా ఎదుర్కుంటున్న మెడికేర్ పేమెంట్ కట్స్ గురించి, ఇమ్మిగ్రేషన్ అంశాలలో ప్రధానమైన గ్రీన్ కార్డ్ బ్లాకేజ్ గురించి అమెరికాలోని చట్టసభల ప్రతినిధులతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సదస్సులో విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని, వారిలో క్రికెట్ లెజెండ్ సునీల్గ వాస్కర్, డాక్టర్ రాహుల్ గుప్త, డైరెక్టర్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ, డాక్టర్ సౌజన్య మోహన్ టెక్సస్ గ్రూప్, ప్రైమ్ హెల్త్ కేర్ సిఇఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, సైంటిస్ట్ పీటర్ జె హెటెజ్, సాధ్వి భగవతి సరస్వతి, అష్టాంగయోగ పరమగురు శరత్ జాయిన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జాక్ రెస్నెక్ జూనియర్లను సత్కరిస్తున్నామన్నారు.
డాక్టర్ దువ్వూరు ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక పురస్కారం : ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నతమైన సేవల్ని అందిస్తున్నందుకు ప్రముఖ వైద్యనిపుణులు, అపి ఓవర్సీస్ కో ఆర్డినేటర్డా క్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి కి స్పెషల్ సర్వీస్ అవార్డును అందించి శాన్ అంటోనియో వేదిక మీద ఘనంగా సత్కరిస్తున్నామని అధ్యక్షురాలు అనుపమ గొటిముకుల వెల్లడించారు.