-ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఉద్యోగికి నష్టం జరగకుండా జీపీఎస్ లో చర్యలు తీసుకున్నాం. సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్రంపై ఆందోళనకరంగా భారం పడుతుంది. ప్రభుత్వానికి,ఉద్యోగికి ప్రయోజనం ఉండేలా మధ్యే మార్గంగా గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం తెచ్చాం. ఉద్యోగికి కుటుంబానికి భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస భాధ్యత. ఉద్యోగి రిటైర్ అయ్యాక మినిమం పదివేలు పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్ లో మార్పులు చేశాం. ఉద్యోగి రిటైర్ అయినా వైద్య బీమా కొనసాగించాలని నిర్ణయించాం. ఉద్యోగి చనిపోతే ప్రమాదబీమా కల్పించేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగి చనిపోయినా …భార్యకు పెన్షన్ అందించేలా సవరణలు చేశాం.
ఉద్యోగులకు ఒపీఎస్ ఇచ్చే పరిస్థితి లేదు. సీపీఎస్ రద్దు చేస్తే ప్రభుత్వానికి మోయలేని బరువు అవుతుంది. ఉన్నంతలో బెటర్ గా ఉన్నదాన్ని మేము ఇస్తున్నాం. ఉద్యోగులకు ఇంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కేలా జీపీఎస్ తీసుకువచ్చి చర్యలు తీసుకున్నాం. జీపీఎస్ పై ఉద్యోగులు మరిన్ని సూచనలిస్తే స్వీకరిస్తాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా వారిపై పోలీసులు కేసులు పెట్టారు. పోలీసు చర్యల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే కేసుల ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటాం.