-శ్రీనివాస్ కాశిచాయానుల అదాన్ డిస్టిలరీస్ పేరుతో ఏపీలో మద్యం వ్యాపారం చేస్తున్నాడు
-విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం వ్యాపారం
-మూడున్నరేళ్లలో రూ.24వేల కోట్లు కల్తీ మద్యం వ్యాపారం
-జగన్ రెడ్డి నేడు క్విడ్ ప్రో కో – 2 ను సిద్ధం చేశా
-ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ఢిల్లీ మద్యం మాఫియా వెనుకున్న వ్యక్తులను సీబీఐ, ఈడీ దర్యాప్తు చేసి ఒక్కొక్కరినీ బయటకు లాగుతోంది.2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మద్యం మాఫియాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశాలతో మద్యం మాఫియాను నడుపుతోంది. దీనిపై పలుమార్లు వివిధ సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
మద్యం నిషేధం అంటూ 2019లో మోసకారి హామీ ఇచ్చి ఓట్లు దండుకుని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.మద్యం కొత్తపాలసీ పేరుతో వైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో రూ.77వేల కోట్ల మద్యం వ్యాపారం చేసింది.ఏపీబీసీఎల్ అధికారిక వెబ్ సైట్ నుండి తీసుకున్న సమాచారం ప్రకారం గత మూడేళ్లలో రూ.70,230కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. 8,60,00,045 విస్కీ కేసులు, 35355433బీర్ కేసులు అమ్ముడుపోయాయి.
విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం వ్యాపారం రాష్ట్రంలో జరుగుతోంది. వారికి సంబంధించిన కంపెనీల కల్తీ బ్రాండులను ప్రజలకు అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేలాది మంది కల్తీ మద్యానికి ప్రాణాలు కోల్పోయారు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ఏపీలో కల్తీ మద్యం వ్యాపారంపై ఈడీ, సీబీఐ పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలి.
మద్యం వ్యాపారం వెనుక ఉన్న సూత్రదారులు, పాత్రదారులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. ఢిల్లీ మద్యం మాఫియాలో కీలక పాత్రదారిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. అరబిందో కెమ్ ఫార్మా, ట్రైడెంట్ లైఫ్ సైన్సెన్ కు సీఎఫ్ఓ గా ఉన్న వ్యక్తి శ్రీనివాస్ కాశిచాయానుల అదాన్ డిస్టిలరీస్ పేరుతో ఏపీలో మద్యం వ్యాపారం చేస్తున్నాడు.
శరత్ చంద్రారెడ్డి దగ్గర పనిచేసే చిరుద్యోగుల పేరుతో షెల్ కంపెనీలు నడుపుతున్నారు. శ్రీనివాస్ కాశిచాయానులకు వేలకోట్ల వ్యాపారం చేసే స్తోమత లేదు.దీని వెనుక ప్రభుత్వ పెద్దలున్నారనే విషయం తేటతెల్లమవుతోంది ప్రభుత్వం అమ్మే మద్యం అంతా అదాన్ డిస్టిలరీస్ నుండే తయారై వస్తోంది.
ప్రతినెల సుమారు రూ.600కోట్లు మద్యంపై ప్రజల నుండి పీల్చుకుతింటున్నారు. ఈ మూడున్నరేళ్లలో రూ.24వేల కోట్లు కల్తీ మద్యం వ్యాపారంతో వైసీపీ ప్రభుత్వం దండుకుంది.మా దగ్గర దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలున్నాయి.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు, పారిశ్రామిక వ్యక్తులను సొంత ప్రయోజనాల కోసం వాడుకుని వాళ్లను చివరకు జైలు పాలు చేశారు.
వారిలో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ రెడ్డి ధన దాహానికి బలయ్యారు. జగన్ రెడ్డి నేడు క్విడ్ ప్రో కో – 2 ను సిద్ధం చేశారు. దీనిలో ప్రధాన అస్త్రం మద్యం. దీనిలో ఇప్పటికే రూ.24వేల కోట్లు దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్న అధికారులు, పారిశ్రామిక వ్యక్తులతో తప్పులు చేయించి క్విడ్ ప్రో కో-2కు తెరలేపడానికి, వాళ్లను జైలుకు పంపడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ విచారణ చేసి దోషులను పట్టుకుంటున్నట్లు, ఏపీలో గత 40 నెలలుగా జరుగుతున్న కుంభకోణాలపైనా ఈడీ, సీబీఐ దర్యాప్తులు నిర్వహించాలి. దోషులను అరెస్టు చేయాలి.