Suryaa.co.in

Andhra Pradesh

వేమన విగ్రహాన్ని తొలగించి వేమనను అవమానపరిచారు

– టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

కడప యోగివేమన యూనివర్శిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి వేమనను అవమానపరిచారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ రెడ్డి విధ్వంసక పాలన ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై అనేక కొత్త పుంతలు త్రొక్కుతూ పరాకాష్టకు చేరింది. నిన్న వై.ఎస్.ఆర్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలోని ప్రజాకవి వేమన విగ్రహాన్ని తొలగించి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం ప్రతిష్టించుకునే స్థాయికి దిగజారాడు జగన్ రెడ్డి. దీని ద్వారా జగన్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజాకవి వేమన కంటే వై.ఎస్.ఆర్ గొప్పవాడా? వేమన తన జీవితం మొత్తం ప్రజలలో తిరుగుతూ మూఢనమ్మకాలపై, విలువలపై, కుల వివక్షతలపై చైతన్యం తీసుకొచ్చిన గొప్ప కవి.

చిన్న, చిన్న మాటలతో సామాన్య ప్రజల భాషలో తన రచలనతో సమాజాన్ని ఉత్తేజం చేసినవాడు. వేమన తెలుగుజాతికి మంచి సాహిత్యాన్ని అందించిన ఒక రత్నంలాంటివాడు. 400 ఏళ్ల చరిత్ర కలిగి చారిత్రక పురుషుడు వేమనకు తెలుగుదేశం పార్టీ గౌరవించి నాడు ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ పై వేమన విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. తెలుగుజాతి కీర్తిప్రతిష్టలు ఇనుమడింపచేసేలా తెలుగుదేశం పార్టీ చేస్తే.. నేడు తెలుగువారి కీర్తిప్రతిష్టలు దెబ్బతీసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.

విశ్వధాభి రామ వినురవేమ అనే పదాలు జగన్ రెడ్డికి తప్ప రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆదర్శమయ్యాయి.
అందుకే యోగివేమన విశ్వవిద్యాలయం లోని వేమన విగ్రహాన్ని తొలగించాడు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహాపురుషుడు అన్న ఎన్టీఆర్ పేరును తొలగించారు. పేదవారికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు ఎన్టీఆర్. 1983 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలను యూనివర్శిటి పరిధి కిందకు తెచ్చి వైద్య సంస్కరణలు తెచ్చారు ఎన్టీఆర్. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాలు చేసి దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా నామకరణం చేశారు.

ఇందులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం జగన్ రెడ్డి పతనానికి నాంధి. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు పెట్టే నాటికి జగన్ రెడ్డికి ఓనమాలు కూడా వచ్చి ఉండవు. తెలుగుజాతి యుగపురుషుల పేర్లు మార్చి తన అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవడంతో జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే ఇక్కడ మహాపురుషులైన గురజాడ, శ్రీశ్రీ, వీరభ్రహ్మేంధ్ర స్వామీ లాంటి వారి విగ్రహాలు కూడా కనిపించవని ప్రజలు అనుకుంటున్నారు.

ఒక్క వై.ఎస్.ఆర్ విగ్రహాలు తప్పా రాష్ట్రంలో మరి ఇతరుల విగ్రహాలు కనిపించవు. విజ్జులైన ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామలాలపై ఆలోచన చేయాలి. జగన్ రెడ్డి పిచ్చి చేష్టలకు చరమగీతం పాడాలి. భవిష్యత్తులో గ్రామ దేవతల విగ్రహాలను కూడా తీసేసి తన తండ్రి విగ్రహాలను పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగన్ రెడ్డి విధ్వంసక పాలన ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై అనేక కొత్త పుంతలు త్రొక్కుతూ పరాకాష్టకు చేరింది. నిన్న వై.ఎస్.ఆర్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలోని ప్రజాకవి వేమన విగ్రహాన్ని తొలగించి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం ప్రతిష్టించుకునే స్థాయికి దిగజారాడు జగన్ రెడ్డి.

దీని ద్వారా జగన్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పలనుకుంటున్నాడు? ప్రజాకవి వేమన కంటే వై.ఎస్.ఆర్ గొప్పవాడా? వేమన తన జీవితం మొత్తం ప్రజలలో తిరుగుతూ మూఢనమ్మకాలపై, విలువలపై, కుల వివక్షతలపై చైతన్యం తీసుకొచ్చిన గొప్ప కవి. చిన్న, చిన్న మాటలతో సామాన్య ప్రజల భాషలో తన రచలనతో సమాజాన్ని ఉత్తేజం చేసినవాడు.

వేమన తెలుగుజాతికి మంచి సాహిత్యాన్ని అందించిన ఒక రత్నంలాంటివాడు. 400 ఏళ్ల చరిత్ర కలిగి చారిత్రక పురుషుడు వేమనకు తెలుగుదేశం పార్టీ గౌరవించి నాడు ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వేమన విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. తెలుగుజాతి కీర్తిప్రష్టలు ఇనుమడింపచేసేలా తెలుగుదేశం పార్టీ చేస్తే నేడు తెలుగువారి కీర్తిప్రతిష్టలు దెబ్బతీసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.

విశ్వధాభి రామ వినురవేమ అనే పదాలు జగన్ రెడ్డికి తప్పా రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆదర్శమయ్యాయి. అందుకే యోగివేమన విశ్వవిద్యాలయం లోని వేమన విగ్రహాన్ని తొలగించాడు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహాపురుషుడు అన్న ఎన్టీఆర్ పేరును తొలగించారు. పేదవారికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు ఎన్టీఆర్. 1983 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలను యూనివర్శిటి పరిధి కిందకు తెచ్చి వైద్య సంస్కరణలు తెచ్చారు ఎన్టీఆర్.

తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాలు చేసి దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా నామకరణం చేశారు. ఇందులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం జగన్ రెడ్డి పతనానికి నాంధి. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు పెట్టే నాటికి జగన్ రెడ్డికి ఓనమాలు కూడా వచ్చి ఉండవు. తెలుగుజాతి యుగపురుషుల పేర్లు మార్చి తన అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవడంతో జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే ఇక్కడ మహాపురుషులైన గురజాడ, శ్రీశ్రీ, వీరభ్రహ్మేంధ్ర స్వామీ లాంటి వారి విగ్రహాలు కూడా కనిపించవని ప్రజలు అనుకుంటున్నారు. ఒక్క వై.ఎస్.ఆర్ విగ్రహాలు తప్పా రాష్ట్రంలో మరి ఇతరుల విగ్రహాలు కనిపించవు.

విజ్జులైన ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామలాలపై ఆలోచన చేయాలి. జగన్ రెడ్డి పిచ్చి చేష్టలకు చరమగీతం పాడాలి. భవిష్యత్తులో గ్రామ దేవతల విగ్రహాలను కూడా తీసేసి తన తండ్రి విగ్రహాలను పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.తెలుగుజాతి మార్గదర్శి, ప్రజాకవి వేమన విగ్రహాన్ని తొలగించి అవమానపరిచారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పిచ్చి నేడు పరాకాష్టకు చేరింది. ప్రజాకవి వేమన కంటే జగన్ తండ్రి గొప్పవాడా? కుంభకోణాలకు పాల్పడిన జగన్ తండ్రి ఎక్కడా? ప్రజలను చైతన్యం చేసిన వేమన ఎక్కడ?

చరిత్రను చెరిపేద్దామని చూస్తే జగన్ చరిత్రే చెరిగిపోతుంది. ‘విశ్వదాభిరామ వినురవేమ’కు అర్థం తెలుగువారందరికి తెలిసినా, జగన్ కు తెలియదు. జగన్ విధ్వంసకర పాలన రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మహనీయులు, మేధావులంటే జగన్ కు లెక్కలేకుంది. విగ్రహాన్ని తొలగించడాన్ని, ఎన్టీఆర్ హెల్త యూనివర్శిటీ పేరు మార్చడాన్ని గవర్నర్ కలుగజేసుకోవాలి. ప్రజావేదిక తొలగించడం నుండి ప్రారంభమైన పచ్చి పెరుగుతూపోతోంది. కడపలో యోగివేమన యూనివర్శిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి జగన్ తన తండ్రి వైఎస్ విగ్రహం పెట్టడం మేధావుల స్థాయి తగ్గింగడమే. వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడమంటే వైఎస్ స్థాయి పెంచే ప్రయత్నంగా భావించొచ్చు.

రంగులు, పేర్లు, విగ్రహాలు మార్చే విషపు సంస్కృతికి నాంది పలికిన జగన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పెట్టారు. చెడ్డవారికి అధికారం ఇస్తే మంచిని వెళ్లగొడతారు అని వేమన ఎప్పుడో చెప్పి ఉన్నారు. చెప్పులు తినే కుక్కకు చెరుకు తీపి రుచి ఎలా తెలుస్తుంది? అని పద్యం రూపంలో వేమన తెలిపారు. జగన్ లాంటివారు అధికారంలోకి వస్తారని ఊహించే కవులు ముందుగానే తమ రచనల్లో పేర్కొన్నారా? అనిపిస్తుంది. కనకపు సింహాసనముపై శునకమును కూర్చోబెట్టిన ఇలాంటి వారు అధికారంలోకి వస్తారని ఊహించే శతకకర్తలు రాసినట్లుంది.

జగన్ అనేక విధ్వంసకర పనులకు పూనుకుంటున్నాడు. గవర్నర్.. యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన అరాచకంపై స్పందించాల్సివుంది. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీరామారావు పేరును అకారణంగా అసెంబ్లీలో వ్యతిరేకించారు. 5 కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చినా గవర్నర్ స్పందించలేదు. ఆంధ్ర యూనివర్శిటీలో క్వశ్చన్ పేపర్ లో వైసీపీ విధానాలపై ప్రశ్న రావడం దారుణం.

చంద్రబాబునాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జెడ్ ప్లస్ కేటగిరి వుంది. ప్రతిపక్ష నాయకుడు. అలాంటి ఆయనపై నందిగామలో రాళ్లు విసిరారు. ఇది మంచి పరిణామం కాదు. ఇటువంటి అరాచకత్వం, విధ్వంసానికి కళ్లెం వేయాల్సిన అవసరముందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.

LEAVE A RESPONSE