Suryaa.co.in

Andhra Pradesh

ప్రమాదరహిత రోడ్లే కూటమి ప్రభుత్వ లక్ష్యం

  • మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి 
  • ‘మిషన్ పాట్-హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ 
  • కోసిగి-పెద్దతుంబలం రహదారి మరమ్మత్తుల పనులు ప్రారంభం

మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి రహదారి మరమ్మత్తులు రెండు కోట్ల రూపాయలతో పనులను చేపట్టనున్నారు.అందులో ఈరోజు కోసిగి -పెద్దతుంబలం రహదారి మరమ్మతు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి .

భూమిపూజ అనంతరం ఎన్.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సులభతరం మరియు ప్రమాద రహిత రోడ్లు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యం..గత వైసీపీ ప్రభుత్వంలో భారీ గుంతలతో అధ్వానంగా మారిన పల్లెల రహదారులను మరమ్మతులు చేయడానికి దాదాపు రెండు కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు.

R&B రోడ్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు 600 కోట్లు మంజూరు చేశారు. అవసరమైతే ఇంకా 300 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 500 కిలోమీటర్ల తారు రోడ్ల మరమ్మత్తుల పనులను ఒకేసారి ప్రారంభించామని టిడిపి ఇంచార్జ్ మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముత్తురెడ్డి, రామిరెడ్డి, జ్ఞానేష్, బిజెపి రాముడు, వక్రని వెంకటేష్ ,నర్సిరెడ్డి ,అరివిలి వీరేష్ ,కోసిగియ్య, సొట్టన్నా, వీరారెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE