Suryaa.co.in

Andhra Pradesh

సహాయ నిధి చెక్కును లబ్ధిదారునికి అందజేసిన ధూళిపాళ్ళ

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును పంపిణీ చేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సంగం డెయిరి చైర్మన్  ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

లబ్ధిదారుల వివరాలు…

(1).చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జంపాని సురేష్ కి రూ. 3,04,409/- చెక్కును నరేంద్ర కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకున్నామని సహాయం కోసం ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ని అడిగితే, అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A RESPONSE