-అమ్మఒడి అర్హులను తగ్గించేందుకే 75 శాతం హాజరు నిబంధన
-టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు,ఆచంట సునీత
రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా మోసకారి సంక్షేమం నడుస్తోంది. పథకాలు కోతలు, పన్నుల వాతలు, ఛార్జీల మోతలు తప్ప మరో మాట వినిపించడం లేదు. 75 శాతం హాజరు వుండాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమ్మఒడికి అర్హులను దూరం చేసేలా వుంది. ఎన్నికలకు ముందు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు చొప్పున అమ్మఒడి అని చెప్పి అధికారంలో వచ్చాక తల్లికి మాత్రమే ఇస్తామని మాట మార్చారు. ఈ నిర్ణయం వల్ల 40 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం దూరం చేశారు. తల్లికి మాత్రమే ఇచ్చే రూ.15 వేలల్లోనూ మరుగుదొడ్ల నిర్వహణ కోసం అంటూ వెయ్యి రూపాయలు కోత పెట్టి రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నాడు. ఇలా కోత కోయడం వల్ల రూ.445 కోట్లు విద్యార్థుల నుండి లాక్కున్నారు. ఆ లాక్కున్న రూ.445 కోట్లలో ఆయాలకు ఏడాదికి రూ.54 కోట్లు మాత్రమే జీతాల రూపంలో ఇస్తున్నారు. మిగతా రూ.391 కోట్లు ఏమయ్యాయో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
రూ.14 వేలు అమ్మఒడికి ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా రూ.40వేలు గుంజుకుంటున్నాడు. ఇప్పుడు మరింతమంది లబ్ధిదారులను కోతకోసేందుకు 75 శాతం హాజరు వుంటేనే అమ్మఒడి అంటూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు. అమ్మఒడికి మంగళం పాడటానికి జగన్ రెడ్డి కొత్త ఎత్తుగడులు వేస్తున్నారు.? కరోనా సమయంలో లేని నిబంధనలు ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. అలివిగాని హామీలిచ్చి అమలు చేయడం చేతకాక చేతులెత్తేస్తున్నారు. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని జూలైలో ఇస్తామంటూ ఒక ఏడాది ఇచ్చే అమ్మఒడిని దూరం చేస్తున్నారు. చేతకాని వాళ్లు పాలకులైతే పథకాలను ఈ విధంగానే వాయిదా వేసి, ఆంక్షలు విధిస్తారు. రెండేళ్లుగా లేని కొత్త ఆంక్షల నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు తీసుకుంటోంది.? ఓ వైపు ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఈ ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకోవాలని బలవంతంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని 42జీవో తెచ్చారు. అమ్మఒడి వద్దు..మా బడి మాకు కావాలని విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు. అమ్మఒడి వచ్చే జనవరిలో కాకుండా జూలైలో ఇస్తామంటే తల్లులందరితో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తాం.