ప్రముఖ తెలుగు, హిందీ రచయిత. పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ రాజేంద్ర స్మారక విశిష్ట జాతీయ పురస్కారం అందుకున్నారు. వారణాసి (కాశీ) కేంద్రంగా సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం హిందీ విభాగం అధ్యక్షులు సదా నంద శాస్త్రి , మహా మహోమహాపద్యాయ రాధా వల్లభ త్రిపాటిల నుండి యార్లగడ్డ దంపతులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
హిందీ భాషాభివృద్దికి జాతీయ స్దాయిలో కృషి చేస్తున్న నాంది పత్రిక, నాంది సేవా ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను అందిస్తోంది. ఈ అవార్డులో భాగంగా నాంది సేవా ట్రస్ట్ లక్ష్మి ప్రసాద్ కు లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందించింది. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ మాట్లాడుతూ ఉత్తర భారతం లోని వారు ఏదోఒక దక్షిణ భారతీయ భాషను అభ్యసించాలని హితవు పలికారు.
హిందీ తరువాత ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో మాట్లాడే భాష తెలుగు అని, ప్రాచీన భాష హోదా కలిగిన ఆరు భాషలలో తెలుగు ఒకటని పేర్కొన్నారు. తెలుగు భాష విశిష్టత గురించి ఆచార్య యార్లగడ్డ చేసిన ప్రసంగం ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు శశికళా పాండే తదితరులు పాల్గొన్నారు.