ప్రత్తిపాడు టిడిపి అభ్యర్ధి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులుపై దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ప్రత్తిపాడు వైకాపా అభ్యర్ది బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశాలు పెడుతూ ఎన్నికల నియమావళిని యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయిన పోలీసులు ఆయనకు ఎక్కడ లేని వినయవిధేయతలు ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించిన రోజు కొంతమంది పోలీసులు వెళ్లి ఆయనకు పూల బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీడీఓ ఆఫీసులో సైతం లబ్దిదారులకు ఈయన చేతే చెక్కులు ఇప్పించారు. అటుతర్వాత స్వయం సహాయక బృందాల మహిళలకు చీరలు, గిప్టులు పంపిణీ చేశాడు. నిన్న అనగా 21.03.2024 న కిరణ్ కుమార్ తన ఇంట్లో ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాలలకు చెందిన వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న టిడిపి అభ్యర్ధి రామాంజనేయులు అక్కడకు వెళ్లారు. వాలంటీర్లను ప్రలోభపెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించవద్దని హితబోధ చేసిన రామాంజనేయులుపై కిరణ్ కుమార్ తన గూండాలతో దాడి చేయించాడు. బౌతిక దాడులకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోండి.