పోలీసులు అధికారులు నేను చేసిన ఫిర్యాదుకు ఇవాళ్టి ఉదయం వరకు FIR చేయలేదు.FIR లో నమోదు చేసిన సెక్షన్స్ సంతృప్తి కరంగా లేవు.పోలీసులు పెట్టిన సెక్షన్స్ వల్ల నా ఫిర్యాదు నిరుగారిపోతోంది.సెక్షన్స్ సంతృప్తికరంగా లేవు కాబట్టే మళ్ళీ ఫిర్యాదు చేసాను.మళ్ళీ కొత్త fir లో బలమైన సెక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.వారు నమోదు చేసిన సెక్షన్ల వల్ల నేను చేసిన ఫిర్యాదు రూపమే మారిపోతుంది.పోలీసులు ఎఫ్.ఐ ఆర్ నమోదు చేశారు. ఇది ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్ లాగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి మేరకు ఇలాంటి నామమాత్రంగా కేసులు నమోదు చేశారని అనుమానాలు కలుగుతున్నాయి.మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విదంగా మాట్లాడిన హిమంత్ పైన బలమైన కేసులు నమోదు చెయ్యాలి. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని అస్సాం ముఖ్యమంత్రి పై చర్యలు
తీసుకోవాలి.పోలీసులు కేసును నిరుగారిస్తే- న్యాయస్థానంలో కొట్లాడుతాం.వంద లాదిమంది పిల్లలు ఉద్యోగాలు లేక మృత్యువాత పడుతుంటే- కేసీఆర్ పిల్లలు మాత్రం కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులు జరుపుతున్నారు. కొరొనా తో సమాజం అంతా దుఃఖంలో ఉంటే మూడు రోజులు జన్మదిన వేడుకలు ఎలా చేసుకుంటారు?
17వ తేదీన యూత్ కాంగ్రేస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గాడిద కు జన్మదిన వేడుకలు చేయాలనీ పిలుపు.కేసీఆర్ పుట్టినరోజు కానుకగా 1లక్ష నోటిఫికేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న. మోడీకి యూపీలో మేలు చేయడానికే కేసీఆర్ సుపారి తీసుకోని మాట్లాడుతున్నారు. మూడో కూటమి వస్తే యూపీఏ కూటమి బలహీనపడి- ఎన్డీఏ కూటమి బలపడుతుంది.మోడీ నుంచి సుపారి తీసుకున్న సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్.కాంగ్రెస్ తో ఉన్న కూటములను చీల్చడానికే కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. దేశం- తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.