– మంత్రి కొల్లు
మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబమంతా పరారీలో ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదల బియ్యం బొక్కేసి నాని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. YCP అంటేనే దొంగల పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్లో 1,320 టన్నుల PDS బియ్యం ఉన్నాయని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ బియ్యాన్ని షిప్ నుంచి అన్లోడ్ చేయించి సీజ్ చేస్తామన్నారు.