– లోక్‌సభలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
ఢిల్లీ: 15వ ఆర్థిక సంఘం నిధులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మొదటి విడత అందించిన నిధులు ఎన్నని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు లోక్‌సభలో ప్రశ్నించారు. నిధులు విడుదల అయిన విషయం వాస్తవం అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసిన టైడ్, అన్ టైడ్ గ్రాంట్ల వివరాలు తెలియజేయాలని కోరారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ భఘేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గ్రామీణ స్థానిక సంస్థల (RLBలు) కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి (FY) 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన గ్రాంట్ల మొదటి విడతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసినట్లు ఆయన సమాధానం ఇచ్చారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 593.26 కోట్లు టైడ్ గ్రాంట్, 395.51 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లను అందించినట్లు వివరించారు. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు మరియు గ్రామ పంచాయతీలకు వరుసగా 70%, 15%, 15% నిష్పత్తిలో అందించబడతాయని సమాధానం ఇచ్చారు.