– డోన్ శాసనసభ్యుడు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
డోన్: బేతంచర్ల పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డోన్ నియోజకవర్గ శాసనసభ్యుడు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలను తమవిగా తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. ప్రతి ఇంటికి కూటమి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేర్చే దిశగా కృషి చేయాలి అని అన్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.