ప్రముఖ యూట్యూబర్, నటి గాయత్రి గత రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి
ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిన్న(శుక్రవారం)హోలీ పండగ నేపథ్యంలో గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసంపబ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ
ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోహిత్ కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కాగా గాయత్రి మృతిపై పలువురు టాలీవుడ్ నటులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.