Suryaa.co.in

Features

ఉగ్ర మూకల అడ్డా.. హైదరాబాద్ గడ్డ!

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర మూకల కలకలం. భాగ్యనగరంలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకర్తలను భోపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులతో కలిసి హైదరాబాద్‌లో నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు.. 16 మందిని అరెస్టు చేశారు.

అరెస్టైన వారిలో 11 మంది భోపాల్‌, ఐదుగురు హైదరాబాద్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు, డాగర్లు, ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం, సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు.కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. నగరంలో 18 నెలలుగా రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసులతో పాటు.. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.

నిందితులు ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా, ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భోపాల్కు చెందిన నిందితులపై అక్కడి పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. 16మంది నిందితులను భోపాల్కు తరలించారు. యువతను సైతం ఇస్లామిక్ రాడికల్స్గా మార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లను ప్రశ్నించడం ద్వారా ఏదైనా కుట్ర పన్నారా అనే వివరాలు బయటపడతాయని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి

హిందూ నేతలను చంపి ఇక్కడ తలదాచుకోవచ్చు..!
ఉగ్రవాదులకు మన హైదరాబాద్ (సేఫ్ జోన్ ) స్వర్గధామం..!!
“కారు స్టీరింగ్ హైదరాబాద్ ఎంపీ చేతిలో ఉంది” కాబట్టి అడిగే వారు ఉండరు..!! దేశంలోని ఉగ్ర మూలాలన్నీ హైదరాబాదులో ఉండటం విశేషం..! హైదరాబాద్ సేఫ్ జోన్.. చాలా చాలా సురక్షితమైన ప్రాంతం..! ఇది ప్రజలకు అనుకుంటే తప్పులో కాలేసినట్టే..!

హైదరాబాద్ అనేది నేరగాళ్లకు… ఉగ్రవాదులకు… హిందూ వ్యతిరేకులకు స్థావరం.! దేశంలో ఎక్కడైనా హిందూ వ్యతిరేక చర్యలకు.. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడి హైదరాబాదులో తలదాచుకుంటే స్వర్గధామమే..!! వారిని అడిగేవాడు, పట్టుకునేవాడు అస్సలు ఉండడు..!
దేశంలో ఎక్కడైనా ఎవరినైనా హత్యలు చేసి వచ్చి, ప్రశాంతంగా గుండెపై చేయి వేసుకొని నిద్రపోవచ్చు. ఏ అలజడి ఆందోళన లేకుండా దర్జాగా జీవించవచ్చు. ఇది కావాలని విమర్శించే ప్రయత్నం కాదు. వ్యంగ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అంతకన్నా కాదు. వాస్తవ సంఘటనలు పోలీసుల ఆధారంగా రుజువు చేస్తున్నాయి.

మొన్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ లోని కన్నయ్య లాల్ హత్య కేసులో నిందితులు, హంతకులు వచ్చి హైదరాబాద్ లో ప్రశాంతంగా జీవించారు. బిజెపి మాజీ నేత నూపూర్ శర్మ తలను నరికి తీసుకువస్తే నజరానా ఇస్తానంటూ ప్రకటించిన రాజస్థాన్ లోని ఓ ప్రముఖ మసీదు అధినేత, అక్కడి పోలీసుల కళ్ళు కప్పి వచ్చి హైదరాబాదులో సంతోషంగా తలదాచుకున్నాడు.

ఇప్పుడేమో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి (ఇంటెలిజెన్స్ బ్యూరో) అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు మూసా హైదరాబాదులో దర్జాగా తిరుగుతున్నాడు. అతని భార్య విజయవాడలోని ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తూ పోలీసులకు చిక్కకుండా ధీమాగా ఉన్నారు..ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాదులోని శివారు ప్రాంతం మీర్ పేట లోని గాయత్రి నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మూసా మేకల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. దాదాపు మూడేళ్లుగా ఢిల్లీ పోలీసుల కళ్లుగప్పి ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలుస్తున్న హైదరాబాదులో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు.

2020 సంవత్సరంలో ఢిల్లీ మహానగరంలోని చాంద్ బాగ్ లో జరిగిన హిందూ ముస్లింల గొడవలో హిందువులను టార్గెట్ చేసి చాలా మంది ఇళ్లను తగలబెట్టారు. వందల సంఖ్యలో హత్యలు చేశారు. ఒక హిందువుల స్కూలుకు నిప్పు పెట్టి బుగ్గిపాలు చేశారు. ఈ ప్రాంతంలో హిందువులు ఎవరు ఉండకూడదు అంటూ హెచ్చరికలు చేసి భయభ్రాంతులను సృష్టించారు.

అక్కడి నుంచి అందరూ పారిపోయే విధంగా కత్తులతో స్వైర విహారం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోకి వెళ్లిన అంకిత్ శర్మ అనే ఇంటిలిజెన్సీ బ్యూరో పోలీస్ ఆఫీసర్ ను ఘోరంగా చంపేశారు. దాదాపు 237 కత్తి గాట్లతో శరీరాన్ని జల్లెడ మాదిరి కసి తీరా తూట్లు పొడిచారు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా శరీరాన్ని మురుగు కలలో పడవేశారు. డ్రైనేజీ సిబ్బంది కాలువ శుభ్రం చేసే సందర్భంలో అంకిత్ శర్మ మృత దేహాన్ని గుర్తించి వెలికి తీశారు.

ఆ శరీరాన్ని పోస్టుమార్టం పంపితే 237 ఘట్లతో శరీరం జల్లెడ పడిందని పోస్టుమార్టం నిర్వహించే వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ జీవితంలో ఇటువంటి మర్డర్ ను ఎప్పుడు చూడలేదని.. ఆశ్చర్య వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్య అనుచరుడు, అక్కడి స్థానిక కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ ఈ అల్లర్లకు నేతృత్వం వహించాడు. హిందువులపై రాళ్ల వర్షం కురిపించాడు. పెట్రోల్ బాంబులు విసిరాడు. ఈ దెబ్బతో ఈ ఏరియాలో ఉన్న హిందువులు తమ ఇళ్లు ఖాళీ చేసి పారిపోవాలని భయానక వాతావరణం సృష్టించాడు.

మొత్తంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే .. హైదరాబాద్ అనేది ఉగ్రవాదులకు స్థావరంగా మారింది. ఇక్కడ మజ్లీస్ పార్టీతో కలిసి ఏర్పాటైన ప్రభుత్వం కొనసాగుతోంది కాబట్టి, మనం ఏం చేసినా చెల్లుతుంది అనే భావన ఉగ్రవాదులలో బలంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ నడుపుతున్నాడని.. ఇక్కడి “కారు స్టీరింగ్ ఆయన చేతిలోనే ఉంది”అనే ధీమా ఉగ్రవాదులను హైదరాబాద్ కు రప్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎందుకంటే ఇటీవల కాలంలో పిఎఫ్ఐ కార్యకలాపాలు రాష్ట్ర మొత్తం విస్తరించిన కూడా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు వ్యవహరించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ఎజెండా ముందుకు తీసుకు పోతుంది. అందులో భాగంగానే దేశం మొత్తం నిషేధించిన హిందూ వ్యతిరేకి కమెడియన్ మునావర్ ఫారుకి షో ను తెలంగాణ ప్రభుత్వం వేలాది పోలీసుల భద్రత మధ్య నిర్వహించి ముస్లింలను సంతోష పరిచింది.
దేశంలో ఎక్కడ జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా.. హిందూ వ్యతిరేక పనులు చేసినా.. వాటి మూలాలు మాత్రం హైదరాబాదులో లభించడం విశేషం..!

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )

LEAVE A RESPONSE