– కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్
హైదరాబాద్: హారీష్ రావు రాజకీయాలు చేయడం కోసం ఎస్ఎల్బీసీ కి పోయిండు అనిపిస్తుంది అది సిగ్గు చేటు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన ప్రకృతి విలయం లాగా చూడాలి మీ వల్లనే ఎస్ఎల్బీసీ పడావు పడి అంత ఉత్పాదం జరిగింది.
గతంలో మీరు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చిన చరిత్ర లేదు. కాళేశ్వరం టన్నెల్ కూలినప్పుడు ప్రాణ నష్టం జరిగింది మేము పోయి రాజకీయం చేయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ పెయిల్ అయినప్పుడు ఆ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మల్లు రవిని పోనియ్యలేదు. మీరు పర్మిషన్ అడగకున్నా ఎస్ఎల్బీసీ కి పోతం అంటే పోనిచ్చినం.
కాళేశ్వరం ప్రాజెక్టు ను చూడడానికి గవర్నర్ ను బస్ లు పెట్టి ప్రజలను పంపారు. కానీ ప్రతిపక్ష పార్టీలను పోనీయలేదు. హరీష్ రావు రెస్క్యూ టీం కు సలహాలు ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఎనిమిది మంది కుటుంబాలను ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రెస్క్యూ ను ప్రభుత్వం రిజాల్వ్ చేస్తుంది.