– కేదార్ ఘటన పై విచారణ చేయాలని కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు?
– గాంధీ భవన్ లో టిపిసిసి మీడియా & కమ్యూనికేషన్స్, చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్: కేటీఆర్ .. సినీ నిర్మాత దుబాయ్ లో చనిపోయినప్పుడు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నీ నమ్మిన బంటు అక్కడే ఉన్నాడట. ఉన్నాడా లేడా? ట్విట్టర్ లో ఏ అంశం అయిన స్పందించే కేటీఆర్.. దుబాయ్ లో చనిపోయిన సినీ నిర్మాత విషయం లో ఎందుకు మాట్లాడడం లేదు?
కేదార్ మీకు పరిచయమా కాదా? కేదార్ రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేస్ లో a4 గా ఉన్నారు. కేదార్ కు మీ బావమరిది రాజ్ పాకాలకు దగ్గరి సంబంధం ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కేదార్ ఘటన పై విచారణ చేయాలని కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? ఆ ఘటన లో మీకు మీ మనుషులకు ఎలాంటి ప్రమేయం లేకపోతే విచారణ చేయాలని ప్రభుత్వంను అడగాలి…
బీఆర్‌ఎస్వాళ్ళు చేసిన పాపాల మీద పోరాటం చేస్తున్న వారు వరుసగా చనిపోతున్నారు. రాజలింగ మూర్తి,సంజీవ్ రెడ్డి, కేదార్ ఇలా అన్ని కేసులలో బీఆర్‌ఎస్వాళ్ళు ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ మరణానికి గల కారణాలు బయటకి వస్తాయి.