– ఉరికే ఉత్సాహం..
“ఈయన చాలా నలిగిపోయారు..” అని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని అంటుంటే.. చంద్రబాబు కళ్ళు చెమ్మగిల్లడం..
ప్రతి సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంత తండ్రి కొడుకుల మాదిరిగా ఆప్యాయంగా ఉండటం..
పాదయాత్ర చేసి పార్టీకి ఎంతో సేవ చేసిన లోకేష్ ఎలాంటి అరమరికలు లేకుండా నిన్నటి సమావేశంలో ఎక్కడో వెనక చిరునవ్వుతో కూర్చోవడం..
బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి తలనిమిరి ముద్దాడడం..
తమ్ముడు ని చూసుకొని చిరంజీవి మురిసిపోవడం.. అన్న పాదాలు తాకి తమ్ముడు పులకించి పోవటం..
చంద్రబాబు, పురందరేశ్వరి ఎంతో ప్రేమగా నమస్కారం పెట్టుకోవడం..
“చంద్రబాబు నాయుడు అనే నేను” అని ప్రస్తావించగానే నందమూరి రామకృష్ణ మొహంలోని భావోద్వేగం..
“పవన్ కళ్యాణ్ అనే నేను” అనగానే అభిమానుల చప్పట్లు..
ఇదంతా చూస్తుంటే ఎంత మనసు సంతృప్తిగా అనిపిస్తోంది..
నిన్న మొన్నటి వరకు పచ్చి బూతులు, వెకిలి వేషాలు చూసిన కళ్ళతోనే ఇంత ప్రేమను చూడటం.. ప్రజలు ఎందుకు మార్పును కోరుకున్నారో సుస్పష్టం చేస్తోంది.
– ఏ.బాబు