Suryaa.co.in

Political News

విజయం ఎవరిది?

కలిసి వచ్చిన కాపులది
భుజం తట్టిన బీసీలది
కలుపుకు పోయిన కమ్మలది
ధర్మం కోసం నిలబడిన క్షత్రియులది
ఆశీర్వదించిన బ్రాహ్మలది
విజయోస్తు అన్న వైశ్యులది
మంచికి నిలబడ్డ రెడ్లది
ముందుకొచ్చిన ముస్లింలది.

ఎవడ్రా మమ్మల్ని విడదీసేది?
మీరు చిమ్మిన విషానికే కూలిపోయే మూలాలు కావు మావి.

కళ్లాపి చల్లి
ముగ్గుకర్ర గీసుకుని
తులసమ్మకి దండం పెట్టుకుని కానీ బయటికి అడుగుపెట్టని మంగళకరమైన బ్రతుకులు మావి.

మా మూలాలు ఒకటే.
మా ధర్మం ఒకటే.
మా పద్ధతులు ఒకటే.

మాలో మాకు గొడవలు పెట్టి
నీపబ్బం గడుపు కుందాం అనుకున్నావేమో….
ఏకమై నిలిచిన మా వెంట్రుక కూడా నువ్వు పీకలేవు.

కష్టపడి పనులు చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, కులవృత్తులు చేసుకొని పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించిన మా రూపాయిలో నుంచి బాధ్యతగా మేము కట్టిన పన్నులని పప్పూ బెల్లాలుగా మార్చి తాయిలాలిచ్చి ఓటుబ్యాంకులుగా, నీకు బానిసలుగా మార్చుకుందామనుకున్న నీ పుండాకోరు తెలివితేటలు అర్థం కానివాళ్ళు ఎవరూ లేరు.

కమ్మలూ, కాపులు వేరు కాదు.
మేము అన్నదమ్ములం.
మా ఇద్దరి మూలం ఒకటే.

బెజవాడలో ఎవరో ఇద్దరు ఫ్యామిలీల మధ్య జరిగిన పంచాయితీని రెండు కులాల మధ్య చిచ్చుగా, రావణ కాష్టంగా మార్చి చలికాసుకున్నది నీ బాబు. వాడి పాపం పండబట్టే దిక్కులేని చావు చచ్చాడు.

ఇకపై కమ్మలు, కాపులు వేరు వేరు కాదు.
మా యాదవులు.
మా గవళ్లు.
మా పద్మశాలీలు.
మా చాకలి.
మా మంగలి.
మా రెల్లి.
అందరూ మావాళ్లే.

మా మా గ్రామాల పుట్ట మన్నుతో పునాది పడ్డ మా అమరావతినే కాల తంతావురా?

నీకు తగిలినది మామూలు శాపం కాదురోరేయ్.
మా ఆడపడుచులు అమ్మవారి స్వరూపాలు. వారి శాపనార్థాలు చాలు. నువ్వు తుడిచిపెత్తుకు పోవటానికి.

నీ చివరి రాత రాయబోయేది మా గ్రామ దేవతలే.

ఇకపై మా నినాదం ఇదే

కాలరాద్దాం – కులాల భేదం.
కలిసివుంటేనే – కలదు సుఖం.

– బాలరాజ్ సజ్జా

LEAVE A RESPONSE