– ఆదిశంకరుడు శంకర జయంతి
మనుషుల మధ్యలో తిరిగే భగవంతుడు, కలియుగంలో దైవారాధన ఎలా చెయ్యాలి, హిందూ ధర్మాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన దైవం. అద్వైతం అంటే నిరంతరం మనస్సు పరమాత్మతో కూడివుండాలి అంటే అంతరాయం లేకుండా మధ్య విరామం లేకుండా అన్నీ రెండు ఆత్మలు (ఆత్మలో పరమాత్మ) ఒక్కడే అయినంతవరకు మధ్య విరామం, దూరం లేకుండా ఉండాలి అని వివరించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈవిధంగా చెప్పాను “కాలం గడిచినకొద్దీ కర్మయోగము క్షీణదశకు పొందుతోంది. దాన్ని తిరిగి ఉద్ధరించి అందిస్తున్నాను” అని చెప్పాడు.
శ్రీ కృష్ణుడే – శంకరుడు కృష్ణావతారంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా అవి శంకరుడు కాలంలో ఉన్నాయి ధర్మానికి హాని జరిగినప్పుడు తాను వస్తాను అని చెప్పిన విధంగా శంకరుడు అవతరించాడు శంకరుల కాలంలో 72 మతాలు ఉన్నాయని శంకర్ విజయం చెప్పింది విజయం అంటే ప్రజలు మనుషులపైనా విజయం శంకరులకు “ద్విసప్తతి మాతో చ్ఛే త్రేనమః” అని ఒక నామం అనగా 72 మతాలను లేకుండా చేశారని అర్థం.
శంకర సంప్రదాయం వైదికం- వైదికం అంటే అన్నిటినీ సమన్వయ ఇచ్చేది ఈనాడు సంప్రదాయ మొన్న అన్నింటికీ వేదమే కథ ఆధారం శంకర సంప్రదాయంలో ఉన్నది వైదిక మాత్రమే వీరు వేదంలో కర్మ, భక్తి ,జ్ఞాన ,యోగా ,ధర్మ ,శివ ,విష్ణు సంబంధ విషయాలన్నింటినీ గ్రహించి నమన్వయించారు. అందరి దేవతలను పూజిస్తారు మనిషిలోని దైవత్వాన్ని తొలగించటం అద్వైతం సంకల్ప లేకుండా మనస్సు నిర్మూలించటమే అద్వైత్వం సిద్ధాంతాలు కలకాలం ఉండాలని ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని శాస్త్ర సందేశాలను నివారించటానికి చేయాలని నాలుగు మాటలను స్థాపించారు.
నాలుగు మఠాలను స్థాపించారు. పూరి జగన్నాధంలోని ప్రధానమైన గోవర్ధన్ మఠం తో బాటు శంకరానంద మఠం, శివతీర్థం మఠం, గోపాల తీర్థం మఠం కూడా ఉన్నాయి . ఇవన్నీ అద్వైతి సంప్రదాయానికి చెందిన శ్రీ శంకర భగ్వత్ పాదాలు క్రీస్తు పూర్వం 509 ఆది మోదీ స్థిర ధర్మరాజు 2630 సం|| లు గడిచినా నందన నామ సం|| వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం.పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం తల్లి ఆర్యాంబలకు సుపుత్రోదయం లోకానికి జ్ఞానోదయం అప్పటి గ్రహ సంపత్తి (కలియుగం 2593 సం|| లు) మేషంలో రవి, బుధుడు – చంద్రుడు, స్వక్షేత్రంలో, గురుడు లగ్నంలో శుక్రుడు ఉచ్ఛదశలో శని ఉచ్ఛదశలో, కుజుడు ఉచ్ఛదశలో ఈ శుభసమయంలో మహాపవిత్ర అభిజిత్ ముహూర్తం అందరికీ లభించినది . సత్పలమైనది స్థాపించినవేరేలా ద్వారా
1)ఓం ప్రజ్ఞానం బ్రహ్మ
2)ఓం అహం బ్రహ్మాస్మి
3)ఓం తత్త్వమసి
4) అమమాత్మ బ్రహ్మ
అనేవి వీటికి మహాకావ్యాలు ఇవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,ఆధర్వము వేదము అనేది ఈ మఠాలకు వర్తించేవి. కాబట్టి శంకరులు చూపించిన అద్వైత సిద్ధాంతం మరియు వైదిక మార్గాన్ని అందరూ అనుసరిస్తూ ధర్మ సంస్థాపనకే పాటుపడాలి అనేది నా ఒక్క ఆకాంక్ష.
– డా రవిశంకర్ శర్మ వంగర
పంచాంగకర్త
హైదరాబాద్