Suryaa.co.in

Andhra Pradesh

తీసుకున్న డబ్బు అడిగినందుకు వ్యక్తిపై వాలంటీర్ దాడి

-అడ్డొచ్చిన సోదరుడిపైనా దాడి
– ఇంటి స్థలం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు

యర్రగొండపాలెం మండలం మెట్టబోడు తండాలో ఓ వ్యక్తిపై వాలంటీర్ దాడి చేశాడు. అడ్డువచ్చిన తమ సోదరుడిని సైతం గాయపరిచాడని బాధితులు వాపోయారు. అసలేం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మెట్టబోడు తండాలో వాలంటీర్ తనపై దాడి చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.వెంకటేశ్వర్లు నాయక్కు చెందిన డ్రిప్పైపులను అదే ప్రాంతంలో వాలంటీర్గా పనిచేసే స్వామి నాయక్ అమ్ముకొని డబ్బలు ఇవ్వలేదని ఆరోపించాడు.

లోన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడని బాధితులు వాపోయారు. తమ నగదు తిరిగివ్వాలని వెంకటేశ్వర్లు నాయక్ ప్రశ్నించడంతో తనపై స్వామి నాయక్ దాడికి దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గమనించిన తన సోదరుడు అంజి నాయక్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా… అతడిపైనా దాడి చేసి, తలను గాయపరిచారన్నారు.

LEAVE A RESPONSE