Suryaa.co.in

Sports

20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన

– వరుసగా 6వ విజయం..

రోహిత్ సారథ్యంలోకి భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని నమోదుచేసి, అజేయంగా టోర్నీలో దూసుకపోతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై 20 ఏళ్లుగా ఎదురవుతోన్న ఓటములకు చెక్ పెట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు 4 ఓవర్లలో 26 పరుగులు చేయగా, మహ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చాడు. కానీ, 5వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా వరుస బంతుల్లో డేవిడ్ మలన్, జో రూట్ వికెట్లు పడగొట్టి భారత్‌కు బ్రేక్ త్రూ అందించాడు.

బుమ్రా తర్వాత, మరుసటి ఓవర్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌కు వచ్చాడు. అతను ఓవర్లో 3 పరుగులు ఇచ్చాడు. తర్వాతి ఓవర్ మెయిడెన్. స్పెల్ కొనసాగించిన షమీ 8వ ఓవర్ చివరి బంతికి బెన్ స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్‌లో బుమ్రా మళ్లీ మెయిడిన్ బౌలింగ్ చేయగా, 10వ ఓవర్ తొలి బంతికి షమీ జానీ బెయిర్‌స్టోను బౌల్డ్ చేశాడు.

4 ఓవర్లలో 26/0తో ఇంగ్లండ్ స్కోరు 10 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బెయిర్‌స్టో 14 పరుగులు, మలాన్ 16 పరుగులు చేయగా, రూట్, స్టోక్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.

భారత జట్టు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి, 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇదే అతి తక్కువ స్కోరు. అంతకుముందు 1999లో బర్మింగ్‌హామ్ మైదానంలో భారత జట్టు 8 వికెట్లకు 232 పరుగులు చేసింది.

లక్నోలోని ఎకానా స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 87 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని కంటే ముందు శుభ్‌మన్ గిల్ 9 పరుగులు, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇంగ్లిష్ జట్టులో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు తీశారు.

LEAVE A RESPONSE