టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత బీసీలు గుర్తొచ్చారా జగన్ రెడ్డి గారూ? స్వాతంత్య్రం వచ్చాక బీసీలకు ఏ ముఖ్యమంత్రీ చేయనంత అన్యాయం చేశారు. వెనకబడిన తరగతుల వెన్నుముక విరిచేసిన మీకు బీసీల పేరెత్తే అర్హత లేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు టిడిపి కల్పించిన 34శాతం రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించినందుకు జగన్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలి. 2.70 కోట్ల మంది వెనకబడినతరగతుల జనాభా సబ్ ప్లాన్ నిధులు మళ్లించి బీసీలకి చేసింది ద్రోహం కాదా? ముఖ్య పదవులు మీ సామాజిక వర్గానికి ఇచ్చుకొని బీసీలకు చేసిన సామాజిక అన్యాయంపై బీసీ సభావేదిక నుంచి సమాధానం చెప్పండి. బీసీ సోదరులకు ఉపాధికి ఊతమిచ్చిన ఆదరణ నిలిపేసినందుకా జగన్ రెడ్డి జయహో అని బీసీలు నినదించాలి. బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించిన నరహంతక జగన్ రెడ్డి సర్కారు జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటు.