Suryaa.co.in

Education Features

అగ్నిపథ్..ఆదాయం..అపోహ..అసలు నిజాలు!

యువతా తప్పుద్రోవ పట్టవద్దు.
నాలుగు సంవత్సరాలలో ఒక అగ్నివీర్ సంపాదన ఇంత ఉంటుంది.
సం. 1- 21000 × 12 = 2,52,000
సం 2- 23100 × 12 = 2,77,200
సం. 3- 25580 × 12 = 3,06,960
సం. 4- 28000 × 12 = 3,36,000
4 సం లలో మొత్తం = 11,72,160
రిటైర్మెంట్ అప్పుడు = 11,71,000
మొత్తము = 23,43,160

ఒక నాలుగు సంవత్సరాలలో ఇంత సంపాదన వస్తుంది. అదనంగా క్రమశిక్షణతో కూడిన ఆర్మీ Training లభిస్తుంది. దానితో వ్యక్తిగత జీవితానికి కూడా ఒక discipline ఏర్పడుతుంది.యవ్వనము నీరుకారిపోకుండా, దురలవాట్లపాలు కాకుండా దేశానికి వినియోగపడుతుంది.అంతర్గత దేశ ద్రోహులను ఎదుర్కునే సాహసం ఉంటుంది.వ్యవస్థలలో పేరుకుపోయిన అవినీతిని ధైర్యంగా ప్రశ్నించిఎదుర్కునే సామర్థ్యముంటుంది. అన్నింటినీ మించి ఒళ్ళుదాచుకోకుండా కష్టపడే మనస్తత్త్వముంటుంది. తత్కారణంగా యువత ఆరోగ్యంగా ఉంటుంది.యువతని దురలవాట్లకు గురిచేసి వారిని పక్కదోవపట్టిస్తే , ఈ దేశాన్ని నిర్వీర్యం చేయవచ్చని యోచించే వంటి పార్టీలు , స్వార్థపూరిత కుటుంబపార్టీలు ఈ స్కీంని వ్యతిరేకిస్తున్నాయి. ఆలోచనాశక్తిలేని యువతని రెచ్చగొట్టి అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. విధ్వంసంలో పాల్గొన్నవారికి ప్రభుత్వ రంగంలో ఎక్కడా ఉద్యోగావకాశాలు లేకుండా చేయాలి. ప్రభుత్వం అలా కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు , నెలకు 30,000 సంపాదిస్తారు. మరియు 22 సంవత్సరాల వయస్సులో వారి బ్యాంక్ ఖాతాలో 12 లక్షల పొదుపు ఉన్న గ్రాడ్యుయేట్..? బలగాలలో చేరడం స్వచ్ఛందం, మిమ్మల్ని చేరమని ఎవరూ బలవంతం చేయరు. మీకు పథకం నచ్చకపోతే, కనీసం ప్రజా ఆస్తులను తగలబెట్టవద్దు . నాశనం చేయవద్దు.

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE