-ఓ వైపు తప్పుడు పనులు చేస్తూ…మరోవైపు ప్రతిపక్ష నేతలతో పాటు మీడియా అధినేతలపై దూషణలా?
-ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన సింహపురి గడ్డకు మాయనిమచ్చ తెచ్చాడు
-ఒక ముద్దాయి అడిగితే సీబీఐ విచారణ వేస్తారా…ఎవరిచ్చారయ్యా మీకు డిగ్రీలు?
-మంత్రి పదవి నుంచి కాకాణిని తొలగించడంతో పాటు నెల్లూరు ఎస్పీ విజయరావును బదిలీ చేస్తేసే సీబీఐ విచారణ సాఫీగా జరుగుతుంది
-కోర్టుకి మంత్రికి మధ్య జరుగుతున్న ఈ కేసు న్యాయవ్యవస్థకే ప్రతిష్టాత్మకం. ఈ కేసులో కాకాణికి శిక్షతప్పదు
-అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసు ఫైలు చోరీకి గురైన ఘటనపై ఏపీ హైకోర్టు సీజే బెంచ్ సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించింది.కాకాణి ఈ ఏడాది ఏప్రిల్ 11న మంత్రి అయితే 13వ తేదీ రాత్రి కోర్టులో మాయమైంది. నెల్లూరులోని జిల్లా కోర్టు సముదాయంలో 11 కోర్టులు, వేలాది కేసులకు సంబంధించిన ఫైళ్లు ఉండగా కేవలం కాకాణి ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన ఫైలు మాత్రమే చోరీ అయిందిగంజాయి తాగి రోడ్డు మీద పనుకునే చిల్లర దొంగలు ఆ ఫైలు ఎత్తుకెళ్లారని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు చాలా తేలిగ్గా తేల్చేశారు.
ఈ ఘటనను నెల్లూరు జిల్లా జడ్జి చాలా తీవ్రంగా తీసుకున్నారు…కేసులో ముద్దాయిగా మంత్రి ఉన్న నేపథ్యంలో సక్రమమైన విచారణ జరగలేదంటూ 220 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టి 18 మంది ప్రతివాదులుగా చేర్చింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ కేసులో ప్రధాన ముద్దాయి కాబట్టి, ఆయనకు కూడా ప్రతివాదిగా చేరుస్తూ సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.చేసింది తప్పుడు పని..మళ్లీ మాతో పాటు చంద్రబాబు నాయుడు, మీడియా అధినేతలపై ఆయన నోరు పారేసుకుంటున్నారు..ఆయనే సీబీఐ విచారణ వేయించుకున్నారంట!
అంటే ఇప్పుడు సీబీఐ ఎంక్వయిరీ జరిగేది నీ మీద కాదా కాకాణి?…గంజాయి తాగి రోడ్లపై పడుకునే చిల్లర దొంగలపైనా?ఒక ముద్దాయి అడిగితే సీబీఐ ఎంక్వైరీ వేస్తారా…కనీసం కొంచెమైనా జ్ఞానముండి మాట్లాడుతున్నావా? కాకాణీ..నీకెవరయ్యా డిగ్రీలు ఇచ్చింది?కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనో, న్యాయస్థానాలు ఆదేశిస్తినో సీబీఐ విచారణ వేస్తారనే విషయం అందరికీ తెలుసు.
నాకు, నా కుటుంబానికి విదేశాల్లో ఆస్తులున్నాయంటూ ఆయన నకిలీ వీసాలు, పాసుపోర్టులు, ఆస్తిపత్రాలు, బ్యాంకు స్మేట్మెంట్లు సృష్టించారు..నెల్లూరు చరిత్రలోనే కాదు..దేశ చరిత్రలోనే ఇది అరుదైన కేసు.రాజకీయ ప్రత్యర్థిపై అంతర్జాతీయ స్థాయిలో నకిలీ పత్రాలు తయారుచేయించిన పెద్దమనిషి కాకాణి గోవర్ధన్ రెడ్డి…భారతదేశ చరిత్రలో కనీసం వార్డు మెంబర్ కూడా చేయని పని ఈయన చేశారు.
కాకాణి మంత్రి అయిన మూడో రోజే ఆ కేసుకు సంబంధించి పోలీసులు గతంలో సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు మాయమయ్యాయి. కేసు నుంచి బయటపడేందుకు గోవర్దన్ రెడ్డే ఈ దొంగతనం చేయించివుండాలి.లేదంటే ఆయన కోసం ఎవరైనా చేయించివుండాలి.
ఈ కేసు ఢిల్లీలో జరిగిన ఉపహార్ థియేటర్ ఘటనను గుర్తుకుతెస్తోంది..ఆ కేసులో అసలు కేసుకు రెండేళ్ల శిక్ష అయితే, సాక్ష్యాధారాలు నాశనం చేసినందుకు ఏడేళ్ల శిక్ష అనుభవించారు.నా కుటుంబానికి సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి నకలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో ఆయన సహ ముద్దాయిలందరూ జైలుకెళ్లారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం నెల్లూరు నుంచి పారిపోయి సుప్రీంకోర్టుకెళ్లి కండీషన్ బెయిల్ తెచ్చుకున్నాడు. రెండు నెలల పాటు రోజూ నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ ఎదుట వంగి వంగి సంతకాలు పెట్టివచ్చాడు.నిత్యం చంద్రబాబు నాయుడిని, నన్ను, మీడియా అధినేతలపై నోరుపారేసుకునే గోవర్ధన్ రెడ్డి చరిత్ర ఇది.
2014లో ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి పాలన సాగుతున్న సమయంలోనే నకిలీ మద్యం కేసులో ఆయన ముద్దాయి.మద్యం మాఫియాతో చేతులు కలిపి గోవర్ధన్ రెడ్డి గోవా నుంచి తెప్పించిన విషపూరిత నకిలీ మద్యం తాగి ఐదారు మంది చనిపోయారు.ఆ విషపూరిత నకిలీ మద్యం నిల్వలు సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణికి లెఫ్ట్ అండ్ రైట్లుగా ఉన్న ముఖ్య అనుచరుల ఇళ్లలోనూ దొరికాయి.నకిలీ మద్యం కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి సహముద్దాయిలు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు.
ఇంటర్నేషనల్ స్మగ్లర్ అప్పూ అలియాస్ కృష్ణస్వామి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులోనే జైలులో ఉండి చనిపోయాడు..ఈ కేసులోనూ కాకాణి బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు.2016లో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వావిలేటిపాడులో దళితుల భూముల ఆక్రమించు కున్న చరిత్ర ఆయనది.అదే వావిలేటిపాడులో రిటైర్డ్ ఉద్యోగులు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసినందుకు రూరల్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
కాకాణి గ్రావెల్ కక్కుర్తికి వెంకటాచలం మండలంలో కోట్ల విలువ చేసే భూములు 20, 30 అడుగుల లోతు గుంతలతో ఎందుకూ పనికిరాకుండా పోయాయి.ఈ నేరాలు, ఘోరాలన్నింటిని ఆయన్ని మేం చేయమన్నామా..చంద్రబాబు నాయుడు చేయమని చెప్పారా..లేక మీడియా అధినేతలు చేయమని ఆదేశించారా?
ఇంత నీచచరిత్ర పెట్టుకుని నువ్వు కూడా మాట్లాడుతున్నావా గోవర్ధన్ రెడ్డీ..కొంచమైనా సిగ్గు ఉందంటయ్యా నీకు?నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనమోళ్లతో రాజకీయ పోరాటాలు చేసినా ఏనాడు నాపై కేసులు లేవు…ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో నాపై 8 కేసులు బనాయించారు. రోడ్డుపై నడిస్తే కేసు, రైతులకు అండగా నిలబడితే కేసు, దళితుల కోసం పోరాడితే కేసు, చివరికి వైసీపీ నేతల అవినీతిపై ప్రెస్ మీట్లు పెట్టినా కేసులే.కాకాణి లాంటి నేతలు తమ తీరుతో నెల్లూరు జిల్లాను దుర్మార్గాలకు నిలయంగా మార్చేశారు.అప్పట్లో పెండింగ్ లో ఉన్న కేసు విచారణకు వస్తే ఉప ప్రధాని పదవికి ఎల్.కే అద్వానీ రాజీనామా చేసేశారు.
ఇంజనీరింగ్ కాలేజీలపై ఆరోపణలువస్తే, తన కుమారుడు డైరెక్టర్ గా ఉన్నందుకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం పదవి వదిలేశారు.బస్సురూట్ల జాతీయకరణ అంశంలో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వ్యాఖ్య చేసిందని నీలం సంజీవరెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయారు.ఆ మహానుభావులతో నిన్ను పోల్చలేం కానీ….ఎంతో నేరచరిత్రతో పాటు నీచచరిత్ర కలిగిన నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో.
ఏపీ చరిత్రలో ఒక మంత్రిపై నకిలీ మద్యం, నకిలీపత్రాలు వంటి ఎన్నో కేసులు ఉండటంతో పాటు, ఇప్పుడు కోర్టులో పత్రాల మాయంతో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నుందుకు సిగ్గు తో తలదించుకో.
స్వాతంత్ర్య సమరయోధులు, ముఖ్యమంత్రులు, పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాల్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ వంటి ఎందరో పుట్టిన నెల్లూరు గడ్డ పరువుతీసేసిన ఏకైక వ్యక్తివి నువ్వే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇంత నీచచరిత్ర కలిగిన నీ లాంటి వ్యక్తుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు జగన్ రెడ్డిని అనాలి.హైకోర్టు సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత కూడా మంత్రివర్గంలో కొనసాగిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డికైనా ఉండాలి…కొనసాగుతున్న ఇతనికైనా ఉండాలి.
సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని మంత్రిపదవి నుంచి తొలగించాలి…ఆయన వత్తాసు పలుకుతూ కేసును మాఫీ చేసే ప్రయత్నం చేసిన ఎస్పీ విజయరావును నెల్లూరు నుంచి బదిలీ చేయాలి. ఈ రెండూ జరిగితేనే సీబీఐ విచారణ సాఫీగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని మేం నమ్ముతున్నాం.