– వివేకానంద స్కూల్ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ,ఐద్వా డిమాండ్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నా వివేకానంద స్కూల్ ను ఎయిడెడ్ గానే నడపాలని కోరుతూ వివేకానంద స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ,ఐద్వా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యార్థులును ప్రభుత్వం
పట్టించుకోవడం లేదని,వారిని ఇబ్బందులు పెడుతుందని అన్నారు. అక్కడ 14 మంది ఎయిడెడ్ టీచర్లు ఉంటే ప్రభుత్వం బలవంతపు జి.ఓ లు ఇచ్చి వారిని తీసుకోవడం మరియు ఎయిడెడ్ కాలేజీల / స్కూల్స్ ప్రైవేటీకరణ ఆపాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలును ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం చేస్తోందన్నారు , ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న ఎయిడెడ్ లెక్చరర్స్ ని ప్రభుత్వం సరెండర్ చేసుకోవడం విద్యార్థులకు శాపంమని అన్నారు. ప్రైవేటు పరం చేస్తే ఆ విద్యార్థులు ఎక్కడికెళ్లి చదువుకోవాలని ఆ ఫీజుల భారం ఎవరు భరించాలని అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీ.వో నెంబర్ 42,50లను రద్దు చేసి ఎయిడెడ్ కాలేజీలను స్కూల్స్ ను యధావిధిగా కొనసాగించాలని అన్నారు, పేద విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎయిడెడ్ విద్యాసంస్థలు తీర్చిదిద్దుతున్నాయని అలాంటి ఎయిడెడ్ విద్యాసంస్థలు ను ప్రైవేటైజేషన్ అయిన తర్వాత ఫీజు భారం పెరిగిపోయి.
దూర ప్రాంతాలకు విద్యార్థినిలు వెళ్లి ఎలా చదువుకుంటారు, ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రైవేటైజేషన్ చేశారు. చిన్నపిల్లలు దూరం వెళ్లి ఎలా చదువుకుంటారు అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎయిడెడ్ కళాశాలల్లో NCC చేస్తున్న విద్యార్థులకు యూనిఫాం , ఎగ్జామ్ , క్యాంపులు ఉచితంగా ఉండేవి, ఇప్పుడు ప్రవేటికరణకు చేస్తే విద్యార్థులు ఎక్కువ ఫిజులు కట్టుకొని చదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిని అన్నారు. ప్రభుత్వం వీటిని ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రవేటికరణ ఆపకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని దించుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో SFI నగర అధ్యక్షుడు ఓ.యేసు బాబు DYFI నగర ఉపాధ్యక్షుడు SK. నిజాం DYFI నాయకులు SK. పీరు, స్థానిక నాయకులు మహేష్, కే స్వామి, ఐద్వా నగర కార్యదర్శి జాన్సీ, నాయకులు దేవి కుమారి, SFI నగర నాయకులు రాధాకృష్ణ, ప్రసాద్,బార్గవ్,ప్రణీత,సుష్మా, అభిషేక్,రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.