Suryaa.co.in

Andhra Pradesh

ఆలపాటి భారీ మెజార్టీతో గెలుస్తారు

– గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలపాటికి భారీ పోలింగ్ నమోదు కావడానికి కృషి చేసిన పరిశీలకులు, ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

గుంటూరు: ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన పరిశీలకులు, ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, తూర్పు నియోజకవర్గానికి చెందిన అన్ని బూత్‌లను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు, యూనిట్ నాయకులతో ఎక్కువ మంది ఓటర్లను ఓటింగ్ చేసే విధంగా ప్రోత్సహించాలని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్క ఓటర్ తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యం. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి కి భారీ మెజార్టీ లభించాలంటే, ప్రతి ఒక్క ఓటర్ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి” అని పిలుపునిచ్చారు.

పరిశీలకుల బృందం అన్ని పోలింగ్ కేంద్రాలలో క్రమశిక్షణతో కూడిన ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. “ఈ ఎన్నికలలో మన అభ్యర్థికి ఓటు వేయడం అంటే, మన ప్రాంత అభివృద్ధికి మద్దతు ఇవ్వడమే” అని బాలాజీ గారు తెలిపారు. “ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, అందరూ సామరస్యంతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు ” అని ఆయన సూచించారు.

ప్రతి బూత్‌లో ఉన్న కార్యకర్తలు ఓటర్లకు అవసరమైన సహాయం అందించి, వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సహకరించారని. గత ఎన్నికల కంటే ఈసారి భారీగా ఓటింగ్ నమోదు అయిందని, దానివల్ల ఆలపాటి కి అధిక మెజారిటీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ , మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, యువ నాయకులు బట్టు ప్రవీణ్ కుమార్, డిప్యూటీ మేయర్ సాజీల, కార్పొరేటర్ ఎలావుల అశోక్, కార్పొరేటర్ పోతురాజు సమత, తెలుగు మహిళా నాయకురాలు గుడివల్లు వాణి, మాజీ కార్పొరేటర్ గోళ్ళ ప్రభాకర్ , పురుషోత్తమరావు బిజెపి నాయకులు , కిషోర్ కుమార్ జనసేన నాయకులు, దయా రత్నం ఎస్సీ సెల్ నాయకులు బాంక చిరంజీవి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE